రచ్చ ఫేం తమన్నా బయట రచ్చ రచ్చ చేస్తాండాది. దీంతో తనంతట తానే ఉన్న పరువు పోగొట్టుకుంటాంది. ఏమయినా సరే! పబ్లిక్ ఫిగర్ కదా! ఏం చేసినా న్యూస్ .. సరిగా చేయకుంటే న్యూసెన్స్ .. ఆ విధంగా ఆమె న్యూసెన్స్ ను క్రియేట్ చేస్తాండాది సరిగా లేని తన డ్రెస్ సెన్స్ తో! ఇలా అంటే చూసే కళ్ల బట్టీ నేను కనిపిస్తా లేదంటే మీతో కలహిస్తా అని పెద్ద పెద్ద డైలాగులు చెబుతుందేమో ఈ భామ! గారాల చిలక రాయంచ నడకలు బాగుంటాయి.. ఎప్పుడో తెలుసా ఆమె పద్ధతి కట్టు బొట్టూ అన్నవి హద్దు మీరనంత వరకూ!
మంచి మాటలు మంచి దుస్తులు రెండూ కూడా మంచి గుర్తింపునకే కాదు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు బాగా సహకరిస్తాయి. దుస్తులు కారణంగా ఇమేజ్ పెరుగుతుంది అనేందుకు ఉదాహరణలు ఎన్నో! కొందరు సెలబ్రిటీలు వేసుకునే దుస్తుల కారణంగా వారు నడవడి కూడా పబ్లిక్ లో రిజిస్టర్ అవుతుంది. ఉదాహరణకు చేనేత ఉత్పత్తులనే ప్రోత్సహిస్తూ.. ఆ రకం చీరలు కట్టుకుని హీరోయిన్లు జనం మధ్యకు వచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చారే అనుకోండి అప్పుడు వారి బ్రాండ్ ఇమేజ్ ఓ లెక్కల్లో ఉంటుంది.
దుస్తులు కేవలం కంఫర్టబులిటీని మాత్రమే కాదు మన ఐడెంటినే కాదు ఇంకా చెప్పాలంటే మనస్తత్వాన్నీ చాటుతాయి. ఎంచుకున్న రంగుల ఆధారంగానే మనస్తత్యం కూడా ఉంటుంది. తాజా అందం మిల్కి బ్యూటీ తమన్నా ఎన్నో సినిమాల్లో మెరిసినా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై ఓ చిన్న తరహా వివాదమే వస్తోంది. ఆమె పబ్లిక్ ఎపీరియన్స్ పై నెటిజన్లు విపరీతంగా మాట్లాడుతున్నారు. వీటిపై ఆమె సీరియస్ అయినా కాకపోయినా ఇకనైనా వస్త్ర ధారణపై ఆమె కాస్త దృష్టి పెడితే చాలు. మంచి ఫలితాలు వస్తాయి.. పబ్లిక్ లో ఈ అమ్మడి ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయం.
దుస్తులు ఏమయినా శరీరానికి నప్పితే చాలు.అనవసరం అయిన హంగామా ఏమీ చేయకుండా ఉంటే మేలు. దుస్తులు ఏమయినా ఇతరులను ఇంప్రెస్ చేస్తే చాలు.. అంతుకుమించి ఎక్కువ ఆర్భాటం ఏమీ ఉండనవసరం లేదు. కోరుకోనవసరం కూడా లేదు. అవును! దుస్తులు నలుగురిలో గుర్తింపు ఇస్తాయి.నలుగురిలో గౌరవాన్ని పెంచుతాయి.అవి ఇచ్చే హుందాతనం దగ్గర ఓ మనిషి విలువ ఉన్నట్టుండి పెరిగి పోతుంది. కనుక అందాల తారలెవ్వరయినా డిజైనర్ వేర్స్ కే ఎక్కువగా ప్రయార్టీ ఇస్తారు.వాళ్ల దుస్తుల్లో పార్టీ వేర్స్ అని వేరుగా ఉంటాయి.
సినిమాల్లో ఎలా కనిపించని బయటకు వచ్చేటప్పుడు నలుగురు చూస్తారు అన్న ఇంగితం ఉండాలి.. అన్నది ఓ వాదన. కాదు కాదు మా దుస్తులు మా ఇష్టం అని వాదిస్తే ఏం చెప్పలేం. తాజాగా తమన్నా భాటియా ఓ వివాదంలో ఇరుక్కుంది. తను వేసుకున్న దుస్తులు అంతగా బాలేవని చెబుతూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె దుస్తులు అస్సలు సరిగా లేవని వాదన వినిపిస్తోంది. దీనిపై మిల్క్ బ్యూటీ ఏ విధంగా స్పందించనుందో మరి!