కాజల్ అగర్వాల్ ఎప్పుడో 2005లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముదురు ముద్దుగుమ్మ వయస్సు ఇప్పటికే మూడున్నర పదులకు చేరువు అవుతోంది. అయినా అమె పెళ్లి జోలికి వెళ్ళడం లేదు. గత నాలుగేళ్లుగా కెరీర్ పరంగా ఆమె తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది. మధ్యలో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిపోవాలని విశ్వప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాక ఓ బిజినెస్‌మేన్‌తో కొద్ది రోజుల పాటు డేటింగ్ వ్యవహారాలు నడిపిందని వార్తలు వచ్చాయి.
ఆ టైంలోనే కెరీర్ పరంగా కూడా కాజల్‌కు కలిసి రాకపోవడంతో ఆమె ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఆమె కెరీర్ గాడిలో పడింది. మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఆమె ఒక్కసారిగా సెకండ్ ఇన్సింగ్స్‌లో పుంజుకుంది. ఆ వెంటనే వరుస పెట్టి బెల్లంకొండ శ్రీనివాస్‌తో కవవం.. సీత సినిమాలు చేసింది. సెకండ్ ఇన్సింగ్‌తో ఫుల్ స్వింగ్‌తో వెళుతోంది.
ప్రస్తుతం ఆమె చేతిలో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకో మూడేళ్ల వరకు ఆమె బిజీగానే ఉంటుంది. కెరీర్ నెమ్మదించినప్పుడే పెళ్లి చేసుకోని కాజల్.. వరుస ప్రాజెక్ట్స్ ఉంటే ఖచ్చితంగా చేసుకోదనే చెప్పాలి. ఇక తాజాగా ఆమె పెళ్లి గురించి మీడియా వాళ్లు పెళ్లి ప్రస్తావన తీసుకు వస్తే ఆమె రొటీన్ ఆన్సర్ ఇచ్చింది.
తనకు నచ్చినవాడు దొరికితే చేసుకుంటాను అంటూ చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం ‘క్వీన్, ఇండియన్-2, ముంబై సాగా, కాల్ సెంటర్’ అనే సినిమాల్లో నటిస్తున్న ఈమె తమిళం, హిందీ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. ఇప్పటికే మూడున్నర పదుల వయస్సులో ఉన్న ఆమె మరో రెండు, మూడేళ్లు అంటే 37-38 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి చేసుకునేలా లేదు.