Acharya: ‘ఆచార్య’లో ప్రత్యేక ఆకర్షణగా ‘ధర్మస్థలి’..ఒకే చోట అన్ని ఎకరాల్లో పెద్ద సెట్

-

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన ఫిల్మ్ ‘ఆచార్య’. ఈ పిక్చర్ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ శరవేగంగా చేస్తున్నారు మేకర్స్. దర్శకుడు, హీరోలు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం కోసం నిర్మించిన ‘ధర్మస్థలి’ సెట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.

దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ స్టోరిలో భాగంగా ‘ధర్మస్థలి’ అనే టెంపుల్ టౌన్ ఉండాలని అనుకున్నాడు. ఆయన ఆలోచనకు తగ్గట్లు నిర్మాత సూచనతో ఇండియన్ సినిమాలో ఎప్పుడు వేయని ఒక పెద్ద సెట్ ను వేశారు ఆర్ట్ డైరెక్టర్ సురేశ్. మెగాస్టార్ కు చెందిన 20 ఎకరాలా భూమిలో ఈ సెట్ వేశారు. ఈ ‘ధర్మస్థలి’ ఇప్పటికీ ఉంది. మెగాస్టార్ కు చెందిన కోకాపేట ల్యాండ్ వద్ద సురేశ్ సెల్వరాజన్ ఈ సెట్ వేశారు.

‘ఆచార్య’ సినిమా మెయిన్ స్టోరి ఈ ప్లేస్ చుట్టు తిరుగుతుంది. పూర్తిగా ఎన్విరాన్ మెంట్ ఫ్రెండ్లీగా ప్రశాంత వాతావరణంలో సెట్ ను రూపొందించారు సురేశ్. నాలుగు నెలల పాటు శ్రమించి ఈ సెట్ వేసినట్లు పేర్కొన్న సురేశ్.. ‘పాదఘట్టం’ అనే మరో సెట్ ను కూడా వేశారు.

దర్శకుడు కొరటాల శివకు ఎటువంటి సెట్ కావాలో తనకు బాగా తెలుసని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. గతంలో ‘భరత్ అనే నేను’ సినిమాకు సెట్ వేసిన తాను..‘ఆచార్య’ కోసం సెట్ వేసినట్లు చెప్పారు. ‘ధర్మస్థలి’ సెట్ కోసం తాను వివిధ దేవాలయాలకు తిరిగి అక్కడి రెఫరెన్స్ తో నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news