మహేశ్-రాజమౌళి మూవీ బ్యాక్ డ్రాప్ ఫిక్స్..విజయేంద్ర ప్రసాద్ స్టోరి ఫైనల్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ కోసం సినీ అభిమానులు చాలా కాలం నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా, త్వరలో ఈ సినిమా స్టార్ట్ కానుంది. ‘సర్కారు వారి పాట’ పిక్చర్ పూర్తి చేసిన మహేశ్..తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నారు. RRR వంటి బ్లాక్ బాస్టర్ చిత్రం తర్వాత రాజమౌళి ప్రిన్స్ మహేశ్ తో పిక్చర్ చేస్తున్నారు.

ఈ సినిమాకూ స్టోరి రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్ ఇవ్వనున్నారు. ఇక ఈ మూవీ డెఫినెట్ గా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను ఈ సినిమాకు సంబంధించిన స్టోరి ప్లాట్ ను రెడీ చేసినట్లు పేర్కొన్నారు. సౌత్ ఆఫ్రికా జంగల్ (అడవుల) బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండబోతున్నదని తెలుస్తోంది.

మహేశ్ – రాజమౌళి ఫిల్మ్ కోసం తాను పూర్తి స్థాయి స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నట్లు విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక ఈ పిక్చర్ లో డ్రామా, యాక్షన్ , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉండబోతున్నాయని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ పిక్చర్ సెట్స్ పైకి వచ్చే ఏడాది వెళ్లొచ్చని సినీ పరిశీలకులు చెప్తున్నారు. ‘సర్కారు వారి పాట’ పూర్తి చేసిన మహేశ్..నెక్స్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో SSMB 28 చేస్తారని, ఆ తర్వాతనే రాజమౌళితో మూవీ చేస్తారని తెలుస్తోంది. చూడాలి..ఏం జరుగుతుందో..