‘రెడ్డి’ సెంటిమెంట్ రిపీట్..NBK 107 మూవీకి టైటిల్ ఫిక్స్?

-

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య ..నటించిన ‘అఖండ’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి అందరికీ విదితమే. బోయపాటి శ్రీను-బాలయ్య కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ ఫిల్మ్ కు ప్రేక్షకుల నుంచి ‘అఖండ’మైన ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే బాలయ్య తర్వాత చిత్రాలపైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన 107వ చిత్రం చేస్తున్నారు. ఈ NBK 107 పిక్చర్ లో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తోంది. శాండల్ వుడ్ నటుడు విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ పిక్చర్ పైన ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వార్తల ప్రకారం..దర్శకులు గోపీచంద్ చిత్ర టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు టాక్. ‘‘వీర సింహా రెడ్డి’’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. కాగా, మరో టైటిల్ ‘‘అన్న గారు’’ మూవీ స్టోరి ప్రకారం గా సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారట. అయితే, ‘‘వీర సింహా రెడ్డి’’ టైటిల్ పెడితే చాలా బాగుంటుందని మెగా అభిమానులు అంటున్నారు.

బాలయ్య గతంలో నటించిన చిత్రాల్లో ‘రెడ్డి’ పదమున్న సినిమాలు సక్సెస్ అవడంతో పాటు ‘సింహ’ పేరుతో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీసు రికార్డులను షేక్ చేసింది. ఈ నేపథ్యంలోనే ‘వీర సింహా రెడ్డి’ టైటిల్ ఫిక్స్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. చూడాలి మరి..చివరకు ఏ టైటిల్ ను మేకర్స్ కన్ఫర్మ్ చేస్తారో..

Read more RELATED
Recommended to you

Latest news