జ‌గ‌న్ టాప్ ..ఆయ‌న ఖాతాలో మ‌రో రికార్డ్ ?

-

తెలంగాణ క‌న్నా ఆంధ్రా చాలా విష‌యాల్లో దూసుకుపోవ‌డం అన్న‌ది ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు సంకేతం అని వైసీపీ వ‌ర్గాలు అంటున్నాయి. ఆ విధంగా జ‌గ‌న్ ఓ మంచి ముఖ్య‌మంత్రి గా పేరు తెచ్చుకుంటున్నారు అన్న‌ది వారి మంచి అభిప్రాయం. ఇంకా చెప్పాలంటే స‌దాభిప్రాయం. రాష్ట్రాన్ని ప‌రుగులు తీయించ‌డ‌మే కాదు మోడీ ద‌గ్గ‌ర తిరుగులేని మెజార్టీ తో మ‌ళ్లీ త‌న పార్టీ స‌భ్యుల‌ను తీసుకుని వెళ్ల‌నున్నారు కూడా ! ఈకోవ‌లో ఆ తోవ‌లో నిరంత‌రం ఆయ‌న ప‌నిచేస్తూనే ఉన్నారు.

ఇక రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం విష‌యంలో ముఖ్యంగా సంబంధిత పెంపు విష‌యంలో ఎప్ప‌టి నుంచో అధికారుల‌ను ప‌రుగులు తీయిస్తూనే ఉన్నారు. అయితే ఆయ‌న శైలి కాస్త భిన్నం. క‌ఠినంగా ఏమీ మాట్లాడ‌రు కానీ చేయించాల్సిన ప‌నులు మాత్రం ఆఘ‌మేఘాల పూర్తి చేయిస్తారు. అందుకు తాజాగా జీఎస్టీ వ‌సూళ్లే తార్కాణం.

ఇటీవ‌ల కాలంలో ఉద్యోగుల‌కూ, జ‌గ‌న్ స‌ర్కారుకూ మ‌ధ్య దూరం పెరిగింద‌న్న మాట తరుచూ వినిపిస్తోంది. కానీ అవేం లేవ‌ని నిన్నుటి వేళ జీఎస్టీ వ‌సూళ్లే తేల్చేయి. ముఖ్యంగా ఎంప్లాయ్ ఫ్రెండ్లీ సర్కారు త‌మ‌ద‌ని ప‌దే ప‌దే చెబుతున్న జ‌గ‌న్ ఆ మాట‌ను నిజం చేస్తున్న విధంగానే ఉంటున్నారు. అదే ప‌నిగా వారిపై ఒత్తిడి తీసుకురావ‌డం, పిలిచి క్లాసులు ఇవ్వ‌డం వంటివి ఆయ‌న నైజంలో ఉండ‌వు కానీ చెప్పాల్సిందేదో స్ప‌ష్టంగా చెప్పి పంపుతారు.

మంచి ఫ‌లితాలు తీసుకువ‌స్తే పిలిచి అభినందిస్తారు. ఆ విధంగా జీఎస్టీ వసూళ్ల‌లో ఏపీని ద‌క్షిణాదిలోనే టాప్ పొజిష‌న్ లో నిల‌బెట్టారు. గ‌త ఏడాది క‌న్నా ఈ ఏడాది వ‌సూళ్ల‌లో వృద్ధి అనూహ్యంగా ఉంది. ఇంకా చెప్పాలంటే గ‌త ఏడాది క‌న్నా ఈ ఏడాది వృద్ధి 23 శాతం అధికంగా ఉంది. తెలంగాణ‌లో మాత్రం వృద్ధి 16 శాతంగానే న‌మోదు అయింది. ఈలెక్క‌న ఏపీ స‌ర్కారు త‌ర‌ఫు నుంచి కేంద్ర ప్ర‌భుత్వ ఖ‌జానాకు నాలుగు వేల కోట్ల‌కు పైగా ప‌న్నుల రూపంలో జ‌మ అయ్యాయి. అక్ష‌రాల రూ.4,067 కోట్లు ప‌న్నుల (జీఎస్టీ రూపేణ‌) వ‌సూల‌యి స‌రికొత్త రికార్డుకు కార‌ణం అయింది తాజా ప‌రిణామం. దీంతో కేంద్రం కూడా జ‌గ‌న్ స‌ర్కారు పెర్ఫార్మెన్స్ పై ఆనందోత్సాహాలు వ్య‌క్తం చేయ‌డం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news