దూసుకుపోతున్న ‘సీతారామమ్’.. ఏడో రోజు కలెక్షన్స్.. ఎంతంటే?

-

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్స్ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేసిన ‘సీతా రామమ్’ ఫిల్మ్ ఇటీవల విడుదలై దూసుకుపోతున్నది. క్లాసికల్ ఫిల్మ్ మాత్రమే కాదు ఎపిక్ లవ్ స్టోరి అని సినీ లవర్స్ మూవీపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ నటించారు. కీలక పాత్రలను సుమంత్, రష్మిక మందన పోషించారు. ఇక ఈ పిక్చర్ చూసిన ప్రతీ ఒక్కరు లవ్ స్టోరికి బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాను థియేటర్లలో జనాలు బాగా చూస్తున్నారు కూడా.

టాకీసులకు సినిమాలు చూసేందుకు ఇక ప్రజలు రావనే భ్రమను ఈ సినిమా తొలగిస్తున్నదని సినీ పరిశ్రమకు చెందిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జనాలు థియేటర్లకు హ్యాపీ గా వచ్చి ఈ పిక్చర్ చూస్తున్నారు.

 

తొలి రోజున ఈ సినిమాకు రూ.కోటిన్నర కలెక్షన్ వచ్చింది. రెండో రోజు రూ.2 కోట్లు, మూడో రోజు 2.62 కోట్లు ఇలా.. రోజురోజుకూ కలెక్షన్స్ పెరిగాయి. ఏడో రోజు ఈ సినిమాకు రూ.65లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు రూ.కోటికిపైగా లాభం వచ్చినట్లు సమాచారం.
సినీ ప్రియులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రంగా ‘సీతా రామమ్’ నిలిచింది. ‘బింబిసార’ తో పాటుగా ఈ చిత్రాన్ని కూడా జనాలు విశేషంగా ఆదరిస్తున్నారని మేకర్స్ పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news