అభిమానం: నిధి అగర్వాల్‌కు గుడి కట్టారు..

Join Our Community
follow manalokam on social media

ఒప్పుడు భక్తితో దేవుళ్లకు గుడి కట్టేవారు. ప్రస్తుత కాలంలో అభిమానంతో తమ ఇష్టమైన హీరోలు, క్రీడాకారులకు గుడులు కడుతున్నారు. లాక్‌డౌన్‌లో నటుడు సోనూసూద్‌ చేసిన సేవలను కీర్తిస్తూ తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బతాండలో గుడి కట్టి పూజిస్తున్నారు. తాజాగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఫేమస్‌ అయిన హిరోయిన్‌ నిధి అగర్వాల్‌ ప్రస్తుతం మరికొన్ని సినిమాలకు సిద్ధమవుతుంది. అంతేకాక క్రిష్‌ దర్శకత్వంతో పవణ్‌ కల్యాణ్‌తో తెరకెక్కబోతున్న సినిమా నటించే అవకాశం కొట్టేసింది. తాజా ఆమె అభిమానులు ఆమెకు ఊహించని బహుమతి సిద్ధం చేశారు.

తాము అభిమానించి, ఆరాదించే హిరోయిన్‌ నిధి అగర్వాల్‌కు చెన్నైలో తెలుగు, తమిళ అభిమానులు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఆమె విగ్రహం చేయించి గుడి కట్టించారు. ఆమె విగ్రహానికి పూజలు, పాలాభిషకాలు చేశారు. కేక్‌లు కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ విషయాన్ని నిధి ఫ్యాన్స్‌క్లబ్‌ సభ్యులు ట్విటర్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం ఆ సంబరాల ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఎంత అభిమానం ఉంటే మాత్రం ఏకంగా విగ్రహం, గుడి కట్టించి పూజలు చేయడం ఏంటని కొందరు అవక్కవుతున్నారు. అయితే.. ఆమె అభిమానులు చేసిన గుడి, సంబరాల గురించి నిధికి తెలిసిందా .. లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు. ఒకవేళ తెలిస్తే ఆమె ఎలా స్పందిస్తారో అని∙చైన్నైలోని తెలుగు తమిళ అభిమాననులు వేచి చూస్తున్నారు.

TOP STORIES

ఇక నుండి 24×7 కరోనా వాక్సిన్…!

ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని...