‘విరాట పర్వం’ ఎపిక్ లవ్ స్టోరి..ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన నిఖిల్

-

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ఫస్ట్ రివ్యూ అప్పుడే వచ్చేసింది. ఈ నెల 17న విడుదల కానున్న ఈ చిత్రాన్ని విడుదలకు ముందే స్పెషల్ స్క్రీనింగ్ లో యంగ్ హీరో నిఖిల్ చూసేశారు. ట్విట్టర్ వేదికగా సినిమా రివ్యూ కూడా ఇచ్చేశారు.

‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ కరోనా మహమ్మారి వలన పలు మార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 17న విడుదల కాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ సభ్యులు ఫుల్ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పిక్చర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంత చక్కటి చిత్రాన్ని అందించిన డైరెక్టర్ వేణు ఊడుగుల, నిర్మాత చెరుకూరిలకు హ్యాట్సాఫ్ అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చఏశారు. ఇటువంటి సినిమాను అస్సలు మిస్ కావొద్దని, ఇదొక ఎపిక్ లవ్ స్టోరి అని, ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news