మీ అందరి అభిమానానికి రుణపడి ఉంటా..!

-

జీ తెలుగు రాధకు నీవేరా ప్రాణంతో మరోసారి మీ ముందుకు వస్తున్నా‌‌: నిరుపమ్ పరిటాల
హైదరాబాద్/విజయవాడ: సరికొత్త కథాంశాలతో అలరించే సీరియల్స్, అత్యద్భుత కాన్సెప్ట్లతో నాన్ఫిక్షన్ షోలతో అలరిస్తున్న జీ తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎప్పుడూ ముందుంటుంది. ఈ నెల 24 నుంచి జీ తెలుగులో సరికొత్త సీరియల్ ‘రాధకు నీవేరా ప్రాణం’ ప్రారంభం కానున్నట్లు ఇటీవలే ప్రకటించారు నిర్వాహకులు.

కాగా, ఈ సీరియల్లో ప్రధాన పాత్రలో టెలివిజన్ సూపర్స్టార్ నిరుపమ్ పరిటాల నటిస్తున్నారు. మంచి మంచి పాత్రలతో తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు అందుకున్న నిరుపమ్ ఓ సూపర్ పోలీస్ కార్తిక్ కృష్ణగా ఈ సీరియల్తో రానున్నారు. హిట్లర్గారి పెళ్లాం సీరియల్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నిరుపమ్‌‌, గోమతి ప్రియ మరోసారి జంటగా రాధకు నీవేరా ప్రాణంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నటి చైత్రా రాయ్ కూడా ఈ సీరియల్లో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ సందర్భంగా ఏప్రిల్ 20, గురువారం రోజున జీ తెలుగు నిర్వహించిన అభిమానుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో భాగంగా తన సొంతూరైన విజయవాడలో అభిమానులను నేరుగా కలుసుకున్నారు నిరుపమ్. అభిమానులతో కలిసి రాధకు నీవేరా ప్రాణం లాంఛ్ ప్రోమో, టైటిల్ సాంగ్ని వీక్షించి తన అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నిరుపమ్ మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం, మీ అభిమానాన్ని నేరుగా అనుభవించడం చాలా సంతోషంగా ఉంది. నా ఇదివరకు సీరియల్స్లానే ఈ రాధకు నీవేరా ప్రాణం సీరియల్ను తప్పక ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ సీరియల్ కథ వినగానే నచ్చింది. అందుకే ఒప్పుకున్నా. పోలీస్ ఆఫీసర్ లుక్ రావడానికి నన్ను నేను మార్చుకున్నా. జీ తెలుగుతో నా బంధం పదేళ్లకు ముందు నుంచీ కొనసాగుతోంది. కెరీర్ ఆరంభం నుంచీ జీ తెలుగు నాకు సపోర్ట్గా ఉంది. మీ అందరి అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా.

రాధకు నీవేరా ప్రాణం ఈ నెల 24 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు 7:30 గంటలకు తప్పక చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. రాధకు నీవేరా ప్రాణం ప్రారంభంతో మిగతా సీరియల్స్ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. వైదేహి పరిణయం మధ్యాహ్నం 12 గంటలకు, దేవతలారా దీవించండి మధ్యాహ్నం 3:30 గంటలకు, కల్యాణం కమనీయం సాయంత్రం 6 గంటలకు ప్రసారమవుతాయి. జీ తెలుగు ప్రేక్షకులు దయచేసి గమనించగలరు.

ప్రేమ, విధి మధ్య సాగే సరికొత్త సంగ్రామం ‘రాధకు నీవేరా ప్రాణం’, ఈ నెల 24న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు, మీ జీ తెలుగులో!

Read more RELATED
Recommended to you

Exit mobile version