EXTRA ORDINARY MAN : నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ వచ్చేసింది

-

 

EXTRA ORDINARY MAN :  టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రెడ్డి హిట్ చూసి చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో భీష్మతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలు వచ్చినట్టే వెళ్లిపోయాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మాచర్ల నియోజకవర్గం కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం ఈ హీరో ఆశలన్నీ వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రీలీలతో కలిసి నటిస్తున్న సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమానే ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’.

NITHIN EXTRA ORDINARY MAN MOVIE TRAILER

అయితే.. నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘100% ఎంటర్టైన్మెంట్ పక్కా అని మేకర్స్ వీడియోను షేర్ చేయగా….కామెడీ, డైలాగ్స్, మ్యూజిక్, హీరో-హీరోయిన్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 8న ఈ మూవీ రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version