RRR లో నిత్యా మీనన్ కన్ఫాం..!

-

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. అలియా భట్ ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయిన ఈ సినిమాలో మరో హీరోయిన్ కోసం వెట మొదలు పెట్టారు. అయితే సినిమాలో తారక్ కు జోడీగా ముందు డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేసినా ఆమె ఎందుకో సినిమా నుండి క్విట్ అయ్యింది.

ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సినిమాలో నిత్యా మీనన్ సెలెక్ట్ అయ్యిందట. అయితే అది డైసీ ఎడ్గర్ జోన్స్ రోల్ కా లేక ఆమె వేరే పాత్రలో నటిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. బాహుబలి లాంటి సినిమాతో ప్రపంచస్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి ఇద్దరు సూపర్ స్టార్స్ తో చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ లో నిత్యా మీనన్ ఛాన్స్ దక్కించుకోవడం లక్కీ అని చెప్పొచ్చు. ఈమధ్య కెరియర్ లో వెనక పడ్డ మళ్లీ ఆర్.ఆర్.ఆర్ తో నిత్యా అదరగొడుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news