ఒకటి కాదు, అటువంటి నాకు రెండు ఉన్నాయి….. సంచలన నిజం బయటపట్టిన రాశి ఖన్నా…!!

-

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని ఫ్యామిలీ హీరోలు నటించిన మనం అనే సినిమా ద్వారా నటిగా చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా, ఆ తరువాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయి, తన నటన అందంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి పేరు దక్కించుకుంది. ఇక అక్కడి నుండి మెల్లగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన రాశి,

ఇటీవల తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే, వెంకీ మామ వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకుంది. విజయ్ దేవరకొండ సరసన ఆమె హీరోయిన్ గా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ లో రాశి మాట్లాడుతూ, ఈ సినిమాలో తన క్యారెక్టర్ కు తన పర్సనల్ క్యారెక్టర్ తో కొంత సంబంధం ఉందని,

 

దర్శకుడు క్రాంతి మాధవ్ ఎంతో బాగా తన పాత్రను రాశారని రాశి చెప్పింది. ఇక మీ లైఫ్ లో లవ్ అనేది ఉందా, ఎవరినైనా ప్రేమించారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన రాశి, జీవితంలో ప్రేమ అనేది ఎంతో మధురమైనదని, అందరిలానే తనకు అటువంటి అనుభవాలున్నాయని, అంతేకాక తన లైఫ్ లో రెండు సార్లు బ్రేకప్ లు జరిగినట్లు రాశి ఆసక్తికరంగా వెల్లడించింది. అయితే తన లైఫ్ లో ఎప్పుడో జరిగిపోయిన అటువంటి విషయాలను మాత్రం పదే పదే గుర్తుచేసుకోవడం తనకు ఇష్టం ఉండదని రాశి చెప్పుకొచ్చింది…..!!

Read more RELATED
Recommended to you

Latest news