ఆస్కార్ అవార్డు కాదు.. అక్కడ ఎదురు చూస్తున్నా మా నాన్న ఎమోషన్.. రాంచరణ్

-

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్అర్ సినిమా ప్రస్తుతం ఆస్కార్బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ అవార్డును గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో పలు హాలీవుడ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్న రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.. తాజాగా ఒక హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్ చరణ్.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకొచ్చారు. అలాగే అతని బాల్యం ఎలా గడిచిందో తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్.. “చిన్నతనంలో మా నాన్న తనకు సంబంధించిన అవార్డులు కానీ ఎలాంటి మ్యాగజైన్లు కానీ మా ఇంటికి తీసుకువచ్చే వారు కాదు. వృత్తి ప్రభావం ఇంటిలో వాళ్ళ మీద పడకూడదని ఆయన అభిప్రాయం. బహుశా సినీ ఇండస్ట్రీ చాలా గ్లామరస్ ఇండస్ట్రీ అని ఆయన అనుకునేవారు. మమ్మల్ని మామూలు పిల్లల్లా పెంచడానికి ప్రయత్నించారు..

Ram Charan entry is emotional in Acharya

మా నాన్న సూపర్ స్టార్ అనే గర్వం మాకు ఏ రోజు తలకెక్కకూడదని భావించేవారు. చిన్నతనంలో నేను ఆటల్లో ఎక్కువగా ఉండటం వల్ల మార్కులు తక్కువగా వచ్చేవి.. అయితే మార్కులు తక్కువ వచ్చిన ప్రతిసారి నన్ను స్కూల్ మార్చేస్తూ ఉండగా రెండేళ్లకు పైగా ఏప్పుడూ నేను ఒకే స్కూల్లో చదవలేదు. కొన్నిసార్లు మార్కుల కోసం అయితే మరికొన్నిసార్లు క్రమశిక్షణ కోసం ఇలా ఉండేవారు. కొత్త కొత్త స్కూల్స్ మారుతున్నప్పుడు అక్కడ ఉండే పరిస్థితులను అర్థం చేసుకుంటూ చుట్టు ఉండే మనుషుల్ని తెలుసుకుంటూ ఉండేవాడిని. చిన్నప్పుడుమాథ్స్, హిస్టరీ ఇష్టంగా చదివేవాడిని. అల్లరిగా కాకుండా మంచి పిల్లాడిగానే ఉండేవాడిని..” అంటూ తెలిపారు.

 

అయితే చిన్నప్పుడు నాన్నతో గడపటానికి ఎక్కువ సమయం దొరికేదికాదు. భోజనం చేసినప్పుడు మాత్రమే ఆయనతో మాట్లాడే వాళ్ళం.. మిగిలిన సమయంలో అతన్ని డిస్టర్బ్ చేయకూడదు అనే రూల్ మా ఇంట్లో ఉండేది. అలాగే చిన్నప్పుడు అంతా ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల చుట్టూ మనుషులు ఉంటూనే ఉండేవారు. ఇంట్లో చాలామంది స్టాఫ్ ఉండేవారు. అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ రోజు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండేవారు. 80 ల్లోనే నాన్నగారి ఒక సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది. కానీ నామినేట్ కాలేకపోయింది. ఆస్కార్ బరిలో నిలిచిన తొలి దక్షిణాది భారతీయ నటుడు ఆయనేనని చెప్పవచ్చు. నాకన్నా బాగా ఆస్కార్ విలువ మా నాన్నకే తెలుసు. ఆస్కార్ కేవలం అవార్డు మాత్రమే కాదు అక్కడ ఎదురు చూస్తున్న మా నాన్న ఎమోషన్.. మాకోసం ఎదురు చూస్తున్నా కోట్ల మంది భారతీయుల ఎమోషన్ కూడా అంటూ తెలిపారు రామ్ చరణ్.

Read more RELATED
Recommended to you

Latest news