యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా.. ఈషా రెబ్బ, సునీల్ ఇంపార్టెంట్ రోల్ చేశారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
బసి రెడ్డి (జగపతి బాబు), నారప రెడ్డి (నాగబాబు) రెండు వర్గాలైన ఈ ఇద్దరు ఒకరంటే ఒకరికి పడదు. తన ప్లానింగ్ తో నారప రెడ్డిని చంపేస్తాడు బసి రెడ్డి. అదంతా మర్చిపోయి వీర రాఘవ (ఎన్.టి.ఆర్) సిటీకి వెళ్లి అక్కడ లైఫ్ సాగిస్తుంటాడు. ఈ టైంలో అతనికి అరవింద (పూజా హెగ్దె) పరిచయం అవుతుంది. ఆ పరిచయం తోనే ఆమె ఊరికి వీర రాఘవని తీసుకొని వెళ్తుంది. ఇక అక్కడ మొదలవుతుంది అసలు సినిమా. అరవింద సమేత ఎవరు..? వీర రాఘవ ఎలాంటి యుద్ధం చేశాడు. బసిరెడ్డికి వీ రాఘవ రెడ్డి ఎలా సమాధానం చెప్పాడు అన్నది సినిమా కథ.
ఎలా ఉందంటే :
త్రివిక్రం, ఎన్.టి.ఆర్ సినిమా అనగానే ఆడియెన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఎప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ మూవీస్ చేసే త్రివిక్రం మొదటిసారి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో చేసిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. సినిమా కథ రొటీన్ రివెంజ్ స్టోరీలా అనిపిస్తున్నా త్రివిక్రం కథనం చాలా కొత్తగా అనిపిస్తుంది. అయితే త్రివిక్రం మార్క్ పంచ్ డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్ మాత్రం ఈ సినిమాలో మిస్ అయ్యాయి.
కంటెంట్ పాడు చేయడం ఇష్టం లేక త్రివిక్రం ఇలాంటి డెశిషన్ తీసుకుని ఉండొచ్చు. ఇక ఎన్.టి.ఆర్ విషయానికొస్తే మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. త్రివిక్రం రాసుకున్న క్యారక్టర్ కు ఎన్.టి.ఆర్ నటన నూటికి నూరు పాళ్లు కుదిరాయి. సినిమా మొదలు పెట్టిన 20 నిమిషాల పాటు సినిమా ఓపెనింగ్ అదిరిపోయింది.
అయితే ఫస్ట్ హాఫ్ ఇంప్రెస్ చేయగా సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ లో మళ్లీ సినిమాను లేపాడు దర్శకుడు త్రివిక్రం. అయితే సినిమాలో త్రివిక్రం మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యింది. నందమూరి ఫ్యాన్స్ ను సగటు సిని ప్రేక్షకుడుకి సినిమా నచ్చుతుంది.
ఎలా చేశారు :
నటనలో ఎన్.టి.ఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీర రాఘవ పాత్రకు బాగా సూటయ్యాడు ఎన్.టి.ఆర్. క్యారక్టర్ ఎంత ఇంటెన్స్ తో కనిపిస్తుందో అంతే ఇంటెస్న్స్ తో నటించాడు. పూజా హెగ్దె కలర్ఫుల్ గా కనిపించింది. సినిమా మొత్తం ఉన్నా ఆమె సోసోగానే అనిపిస్తుంది. ఈషా రెబ కూడా బాగానే చేసింది. సునీల్ నీళాంబరి పాత్రలో అలరించాడు.
పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద అసెట్. తమన్ మ్యూజిక్ ఓకే. రెండు సాంగ్స్, బిజిఎం ఇంప్రెస్ చేశాడు. కథ, కథనాల్లో దర్శకుడు ప్రతిభ కనిపించింది. ప్రొడక్ష వాల్యూస్ అదిరిపోయాయి.
ప్లస్ పాయింట్స్ :
ఎన్.టి.ఆర్
డైలాగ్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
ఎంటర్టైమెంట్
ప్రీ క్లైమాక్స్
బాటం లైన్ :
అరవింద సమేత వీరత్వానికి నిజంగ కొత్త అర్ధమే చెప్పాడు..!
రేటింగ్ : 3.25/5