ఎన్టీఆర్ బయోపిక్.. ఏయన్నార్ లుక్ రిలీజ్

-

నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో ఏయన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తున్నాడని తెలిసిందే. ఏయన్నార్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ ఏయన్నార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఎన్.టి.ఆర్ టీం. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో ఏయన్నార్ గా సుమంత్ అద్భుతంగా సెట్ అయ్యాడు.

మేకప్ మహిమో ఏమో కాని సుమంత్ అచ్చు గుద్దినట్టు ఏయన్నార్ లుక్ లో అదరగొట్టేశాడు. ఏయన్నార్ లైవ్స్ ఆన్ అంటూ ఏయన్నార్ పోస్టర్ తో సినిమాపై మరింత అంచనాలు పెంచేశారు. ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడో ఏయన్నార్ గా సుమంత్ బాగా కుదిరాడు. ఇక సినిమాలో రానా చంద్రబాబు పాత్రలో, హరికృష్ణగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడని తెలిసిందే.

2019 సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాను ఎన్.బి.కే ప్రొడక్షన్స్ లో సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరితో పాటుగా బాలకృష్ణ కూడా నిర్మాణంలో భాగమవుతున్నారు. సినిమాలో బాలకృష్ణ దాదాపు 60 డిఫరెంట్ గెటప్పులలో నటిస్తున్నాడని తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news