బాబాయ్ లో పెద్దాయన్ను చూస్తున్నా..! వీడియో

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వస్తున్న ఎన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల ఆడియో వేడుక హైదరాబాద్ జె.ఆర్.సి కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. పరిశ్రమకు సంబందించిన పెద్దలతో పాటుగా నందమూరి ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో పాల్గొన్నారు. బాలకృష్ణ వేదిక మీద ఉండి ఈ సభని గ్రాండ్ సక్సెస్ చేశారు.

ఇక ఈ వేడుకకు నందమూరి ఫ్యామిలీలో ఒకడిగా ఎన్.టి.ఆర్ కూడా వచ్చాడు. ఈరోజు బాబాయ్ లో పెద్దాయన్ను చూస్తున్నా అని.. ఈరోజు నందమూరి కుటుంబ సభ్యుడిని అయినందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నానని అని అన్నారు ఎన్.టి.ఆర్. అయితే ఇక్కడ తాను ఫ్యామిలీ మెంబర్ గా కాకుండా ఓ మహానుభావుడు చేసిన త్యాగాల ద్వారా లబ్ధి పొందిన ఓ తెలుగు వాడిగా మాట్లాడుతున్నాను.. తెలిసి తెలియని వయసులో పెద్దయన్ను తాతయ్యా అని పిలిచానని.. ఆయన గురించి తెలిసిన రోజు అన్నగారు.. రామారావు గారు అని పిలవడం మొదలు పెట్టానని అన్నరు ఎన్.టి.ఆర్.

వాల్మీకి రామాయణం రాసినప్పుడు నిలువెత్తు ధర్మంగా రాముడిని చూపించాడు. మళ్లీ అలాంటి వాడిని చూడలేమా అన్నవారికి తారక రాముడు వచ్చాడు. పక్క రాష్ట్రం వారికి తెలుగువాడి సత్తాని తొడగొట్టి పౌరుషం చూపించాడు పెద్దాయన. ఇక ఈ సినిమా చేసిన బాలకృష్ణ గురించి చెబుతూ మా తాత గురించి మీ తాత ఓ సినిమా చేశాడని తన పిల్లలకు గర్వంగా చెబుతానని అన్నారు. బాబాయ్ చేసిన ఈ ప్రయత్నం భావితరాలకు మహానుభావుడి చరిత్ర తెలిసేలా చేస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news