‘ఎన్టీఆర్’ బ‌యోపిక్‌ ట్రైల‌ర్‌ విడుద‌ల‌

-

NTR Official Trailer

బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ఎన్టీఆర్. క్రిష్ డైరెక్టర్. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ సినిమా మొదటి భాగం కథానాయకుడు 9 జనవరి 2019న రిలీజ్ కానుంది. రెండో పార్ట్ 7 ఫిబ్రవరి 2019 న రిలీజ్ కానుంది. ఇవాళ సాయంత్రం సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మూవీ యూనిట్ నిర్వహించింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రెండు పార్టుల ట్రైలర్ ఇది.

కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఎన్టీఆర్ భార్య బసవతారకంగా విద్యా బాలన్ నటిస్తుండగా… నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, జయప్రద పాత్రలో హన్సిక, జయసుధ పాత్రలో పాయల్ రాజ్‌పుత్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, సావిత్రిగా నిత్యా మేనన్, ప్రభగా శ్రియా శరణ్ నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news