శర్వానంద్ హీరోగా హను రాఘవపుడి డైరక్షన్లో వచ్చిన మూవీ పడి పడి లేచె మనసు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
కలకత్తాలో చదువు కంప్లీట్ చేసిన సూర్య (శర్వానంద్) జాలీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. మెడికో అయిన వైశాలి (సాయి పల్లవి)ని చూసి ప్రేమలో పడతాడు సూర్య. ఆమెని ప్రేమలో పడేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తాడు. ఆమెని ఎలా గోలా ప్రేమలో పడేసిన సూర్య ఆమెకి ఓ పెద్ద షాక్ ఇస్తాడు. దాని వల్ల సూర్య, వైశాలిలు విడిపోవాల్సి వస్తుంది. ఇంతకీ సూర్య, వైశాలి ఎందుకు విడిపోయారు..? సూర్య మళ్లీ వైశాలిని దక్కించుకున్నాడా..? చివరకు కథ ఎలా ముగిసింది అన్నది ఈ సినిమా.
ఎలా ఉందంటే :
హను రాఘవపుడి ప్రేమ కథలను బాగా డీల్ చేస్తాడు. అయితే అదే విధంగా తను ఏదైతే చెప్పాలనుకున్న పాయింట్ ఉందో అది అంత పర్ఫెక్ట్ గా చెప్పలేడు. లవ్ సీన్స్ వరకు బాగా చేసినా మిగతా కథను అంత గొప్పగా తీయలేడు. ఆ విషయం మళ్లీ పడి పడి లేచె మనసుతో ప్రూవ్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమాను చాలా అద్భుతంగా తీసుకెళ్లిన దర్శకుడు సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పించేశాడు.
హీరో, హీరోయిన్ మధ్య లవ్, ఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. అయితే కన్ ఫ్లిక్ట్స్ ఎక్కువవడం వల్ల సినిమా పక్కదారి పడుతుంది. మరి సినిమాటిక్ గా అనిపించే సన్నివేశాలు కొన్ని ఉంటాయి. అవి సినిమా మీద ఇంప్రెషన్ కోల్పోయేలా చేస్తాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా కాస్త కొత్తగా చేసి ఉంటే బాగుండేది
ఎలా చేశారు :
సూర్య పాత్రలో శర్వానంద్ మెప్పించాడు. శర్వా ఇలాంటి పాత్రలు చేయడం కామనే. కాని ఈ పాత్ర ఇంకా బాగా చేశాడు. ఇక సినిమాలో సాయి పల్లవి పాత్ర బాగుంది. వైశాలిగా మరోసారి తన అభినయంతో అందరిని ఆకట్టుకుంది సాయి పల్లవి. మురళి శర్మ, సంపత్ లు ఉన్నారంటే ఉన్నారని చెప్పాలి.
టెక్నికల్ టీం విషయానికి వస్తే.. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ బాగుంది. ఫీల్ గుడ్ లవ్ సాంగ్స్ బాగున్నాయి. బిజిఎం కూడా మెప్పించాడు. జేకే సినిమాటోగ్రఫీ బాగుంది. కలకత్తా అందాలను బాగా చూపించారు జేకే. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారని చెప్పొచ్చు. దర్శకుడు హను మళ్లోసారి తన ప్రతిభ చూపడంలో ఫెయిల్ అయ్యడు.
ప్లస్ పాయింట్స్ :
లీడ్ పెయిర్
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్
స్క్రీన్ ప్లే
మిస్ యూజ్ కాస్టింగ్
బాటం లైన్ :
పడి పడి లేచె మనసు.. హను బ్యాడ్ లక్ కంటిన్యూస్..!
రేటింగ్ : 2/5