రాసి పెట్టుకోండి.. అఖిల్ పై ఎన్.టి.ఆర్ నమ్మకం..!

-

అఖిల్ మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ పై ప్రశంసలు కురిపించాడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. అఖిల్ లో ఎవరిలో ఉండని ఓ గొప్ప గుణం ఉందని.. అదే ఆత్మ విమర్శ అని.. చాలా తక్కువమందిలో అది ఉంటుందని. కచ్చితంగా అఖిల్ ఫైనెస్ట్ యాక్టర్ అవుతాడని చెప్పారు తారక్. తానేమి స్టార్ డం గురించి చెప్పట్లేదని అన్నారు. ఆత్మ విమర్శ చేసుకునే దమ్ము అఖిల్ కు ఉందని అన్నారు ఎన్.టి.ఆర్.

మిస్టర్ మజ్ నుతోనే అఖిల్ కు కెరియర్ బెస్ట్ హిట్ వస్తుందని అన్నారు. ఇక వెంకీ అట్లూరి తనకు మంచి స్నేహితుడని.. అతను దర్శకుడిగా చేసిన తొలిప్రేమ మంచి విజయాన్ని అందుకుందని ఆ సినిమాలానే మిస్టర్ మజ్ను కూడా గొప్ప విజయాన్ని అందుకుంటుందని చెప్పారు ఎన్.టి.ఆర్. అఖిల్ సినిమాకు ఎన్.టి.ఆర్ ఇచ్చిన నూతన ఉత్సాహం అక్కినేని ఫ్యాన్స్ లో కూడా ఎక్సైట్మెంట్ కలిగేలా చేసింది. మరి జనవరి 25న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news