బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్. ఎన్.టి.ఆర్, చరణ్ లాంటి స్టార్స్ కలిసి మల్టీస్టారర్ చేయడం మాములు విషయం కాదు. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో ఎన్.టి.ఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోశిస్తున్నాడని తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు లేదు కాని ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సెట్స్ లో ఎన్.టి.ఆర్ లుక్ చూసి షాక్ అవుతున్నారు నందమూరి ఫ్యాన్స్.
ఫుల్లుగా గడ్డం.. కాస్త లావెక్కి మళ్లీ ఎన్.టి.ఆర్ తన మునుపటి రూపాన్ని తెచ్చుకున్నాడని అనిపిస్తుంది. ట్రిపుల్ ఆర్ లో ఎన్.టి.ఆర్ రోల్ రివీల్ కాకున్నా ఆయన ఆహార్యం చూస్తుంటే కచ్చితంగా నెగటివ్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. చరణ్ మాత్రం పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాకు సంబందించిన ఓ ఎక్స్ క్లూజివ్ ఎనౌన్స్ మెంట్ 12వ తారీఖు 12 గంటల 12 నిమిషాలకు రివీల్ చేస్తాడట రాజమౌళి. మొత్తానికి ముందునుండి ట్రిపుల్ ఆర్ మీద జక్కన్న పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడు.