నూతన్ రీ రీ ఎంట్రీ.. బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది..!

-

బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో ఏదైనా జరగొచ్చు అని హోస్ట్ గా నాని అంటుంటే ఏంటో అనుకున్నాం కాని నిజంగానే ఈ సీజన్ లో బిగ్ బాస్ లో ఏంటేంటో జరుగుతున్నాయి. ముఖ్యంగా శ్యామలా, నూతన్ నాయుడు రీ ఎంట్రీ షోలో సర్ ప్రైజ్ ఎలిమెంట్. బయటకు వెళ్లిన వారిని ఓటింగ్ ద్వారా వెనక్కి పంపించారు.

అంతా బాగుంది అనుకుంటున్న టైంలో నూతన్ నాయుడు లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో కింద పడ్డాడు. షోల్డర్ కు బలమైన దెబ్బ తగలడంతో నూతన్ కు వైద్య సహాయం అవసరమని బయటకు పంపించారు. అయితే సడెన్ గా శుక్రవారం ఎపిసోడ్ లో నూతన్ నాయుడు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కసారి అయితే రీ ఎంట్రీ అంటారు కాని నూతన్ మళ్లీ మళ్లీ వస్తున్నాడు కాబట్టి నూతన్ నాయుడు రీ రీ ఎంట్రీ అవుతున్నాడు. మరి దీనికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది. ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి ఎప్పటిలానే కెప్టెన్సీ టాస్కులో కౌశల్, దీప్తి పాల్గొనగా ఇంటి సభ్యులు అందరు కలిసి దీప్తిని కెప్టెన్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news