ఆస్కార్ అవార్డుల్లో బోణీ కొట్టిన ఇండియా.. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో పురస్కారం

-

2023 ఆస్కార్‌ అవార్డుల జాబితాలో ఇండియా బోణీ కొట్టింది. ఇండియన్ చిత్రానికి ఆస్కార్ పురస్కారం దక్కింది. డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ అవార్డును సొంతం చేసుకుంది. కార్తికి గొన్సాల్వేస్‌ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీని డగ్లస్‌ బ్లష్‌, గునీత్‌ మోంగా, ఆచిన్‌ జైన్‌ నిర్మించారు.

రఘు అనే ఏనుగును ఆదరించిన బొమ్మన్‌, బెల్లి జంటకు.. ఆ ఏనుగుకు మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. వారి మధ్య ఉన్న సహజ సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని ఇందులో చూపించారు. ప్రకృతికి అనుగుణంగా ఉన్న గిరిజన ప్రజల జీవితాన్ని గురించి కూడా ఇందులో చూపించారు. ఈ ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఆస్కార్ వేడుకకు ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ హాజరైంది. ఆర్ఆర్ఆర్ చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి, సింగర్స్ కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, లిరిసిస్ట్ చంద్రబోస్, నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news