ఆప్ ఎంపీతో ఏడడుగులు వేయనున్న పరిణితి చోప్రా..!

-

బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గత ఎడాది పలువురు బాలీవుడ్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కత్రినా కైఫ్, అలియా భట్, కీయరా అద్వానీ ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పెళ్లికి పరిణితి చోప్రా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఆప్ పార్టీకి చెందిన ఒక ఎంపీ ని పెళ్లి చేసుకోనున్నట్టు సమాచారం.

Parineeti Chopra, Raghav Chadha get engaged; here's wedding date

బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చెద్దాతో గత కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని వార్తలు గట్టిగా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ఒకసారి ఎయిర్పోర్టులో కనిపించడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరింది. ఈ సమయంలో పరిణీతి చోప్రా చేతి వేలికి ఉంగరం కనిపించడం విశేషం. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు బలం చేకూరినట్టయ్యింది.

 

ఆ మధ్య కాలంలో వీరికి దగ్గర సన్నిహితులు.. `రాఘవ్‌ చద్దా, పరిణీతి ల రోకా ఫంక్షన్‌ జరిగింది. ఇది ఫ్యామిలీల మధ్యనే జరిగింది. ఈ విషయంలో రెండు ఫ్యామిలీలు సంతోషంగా ఉన్నాయి. వీరిద్దరు ఈ ఏడాది అక్టోబర్‌ చివరి నాటికి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. మ్యారేజ్‌ విషయంలో హడావుడి ఏం లేదు. పెళ్లి చేసుకోవడానికి ముందు వీరిద్దరికి వ్యక్తిగతంగా కొన్ని కమిట్‌మెంట్లు ఉన్నాయి. వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు` అని సన్నిహిత వర్గాలు నేషనల్‌ మీడియాకి తెలిపినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించకపోగా అసలు విషయం ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news