యూట్యూబ్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతోంది. అయితే, అందులో మీరు ఓ విషయం గమనించారా? పవన్ కళ్యాణ్ జీప్ నంబర్ 2425!
ఒక్కసారి గతంలోకి వెళితే… ‘గబ్బర్ సింగ్’లో పవన్ కళ్యాణ్ రాయల్ ఎన్ఫీల్డ్ బండి . నంబర్ చూస్తే… ఏపీ 27 జీఎస్ 2425 అని ఉంటుంది. ‘దువ్వాడ జగన్నాథం డీజే’ సినిమాలో అల్లు అర్జున్ నడిపిన బజాజ్ చేతక్ చూశారా? దాని నంబరూ 2425 అనే ఉంటుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. సరిగ్గా 20 సెకన్ల దగ్గర పాజ్ చేసి చూడండి… పవర్ స్టార్ జీప్ నుంచి కిందకు దిగే సీన్ వుంటది. ఆ జీప్ మీద టీఎస్ 09 పి 2425 అని రాసి ఉంటుంది!
గబ్బర్ సింగ్, భగత్ సింగ్, డీజే… ఈ ముగ్గురి వెహికల్స్ నంబర్ ఒక్కటే. ఇది కో ఇన్సిడెన్స్ అనుకుంటున్నారా? కాదు. వెహికల్స్ నంబర్స్ మాత్రమే కాదు, ఈ మూడు సినిమాలకూ దర్శకుడు ఒక్కరే.. ఆయనే హరీష్ శంకర్! ఆయన సొంత కారు నంబర్ కూడా 2425 కావడం విశేషం.
దర్శకుల్లో కొంత మందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ కు 2425 నంబర్ అంటే సెంటిమెంట్ అట.. హీరోలు నడిపే వాహనాలకు ఆ నంబర్ పెట్టడం లక్కీగా ఫీల్ అవుతారట.. అందుకే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బండి నంబర్ 2425 అని పెట్టారు. అలాగని, అన్ని సినిమాల్లో సేమ్ నంబర్ ఉపయోగించటం లేదు. ‘గద్దలకొండ గణేష్’లో హీరో వరుణ్ తేజ్ కార్ నంబర్ ప్లేట్ మీద ‘గణేష్’ అని మాత్రమే రాసి ఉంటుంది. అయితే ‘రామయ్యా వస్తావయ్యా’లో సమంత కారుకు కూడా 2425 నంబర్ ఉండటం విశేషం.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విషయానికి వస్తే.. శ్రీ లీల ఓ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, ‘టెంపర్’ వంశీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.