పవిత్ర లోకేష్ ఫిర్యాదు.. 15 యూట్యూబ్ ఛానళ్లకి నోటీసులు

-

తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆపాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు నటి పవిత్ర లోకేష్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన ఫోటోలు మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసత్య కథనాలు వెలువరించిన యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్ల లింకులను కూడా ఆమె పోలీసులకు అందించారు.

 

పవిత్ర నుంచి ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆదివారం 15 యూట్యూబ్ ఛానల్ కు నోటీసులు జారీ చేశారు. మూడు రోజులలోగా విచారణకు హాజరవ్వాలని యూట్యూబ్ ఛానల్ లకు జారీ చేసిన నోటీసులలో పోలీసులు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నరేష్ – పవిత్ర లోకేష్ ల సానిహిత్యం గురించి తీవ్ర స్థాయిలో కథనాలు వచ్చాయి. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల సమయంలోనూ ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. దీంతో వీరిద్దరిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news