తగ్గుతున్న పవన్..సైలెంట్‌గానే దెబ్బ కొడతారా?

-

ఇటీవల కాలంలో పవన్ వైసీపీని టార్గెట్ చేసి..తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. వైసీపీ నేతలు బూతులు తిడుతున్న నేపథ్యంలో వారికి అదే స్థాయిలో పవన్ కౌంటర్లు ఇచ్చారు. అలాగే ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై కూడా సీరియస్ అయ్యారు. ఇక అక్కడ వరకు సీరియస్ గానే ఉన్న పవన్..ఇప్పుడు కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. కాస్త సాఫ్ట్ గానే మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే ఇప్పటంలో బాధితులకు లక్ష రూపాయిలు చొప్పున ఇవ్వడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటం వెళ్లడానికి పర్మిషన్ లేదని చెప్పడంతో పవన్ సైలెంట్ గానే..మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం బాధితులకు సాయం అందించడానికి ఫిక్స్ అయ్యారు. అలాగే తాజాగా తూర్పు కాపు వర్గం చేసిన ప్రతినిధులతో పవన్ సమావేశమయ్యారు. బీసీలు అధికారంలోకి రావాలని, అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరారు. ఆ సమావేశంలో వైసీపీపై ఎలాంటి విమర్శలు చేయలేదు. కానీ బీసీల ఓట్లు చీలకూడదని..అందరూ కలిసి ఒక పార్టీకే ఓటు వేయాలని కోరారు.జనసేన మంచి చేస్తుందనుకుంటే..జనసేనకు ఓటు వేయాలని, లేదంటే వేరే పార్టీకి ఓటు వేయండని సూచించారు. అయితే పవన్ చాలా సాఫ్ట్ గా మాట్లాడటం ఆసక్తికరంగా ఉంది. అంటే ఆయన వర్షన్ మార్చుకున్నారా? లేక తనని కేలికితేనే..తన విశ్వరూపం చూపించాలని అనుకుంటున్నారా? అనేది క్లారిటీ లేదు. ఇటీవల కాలంలో వైసీపీ మంత్రులు పవన్‌పై విమర్శలు చేయడం ఏమి ఆపలేదు. ఆఖరికి జగన్ సైతం సభల్లో రౌడీ సేన అంటూ విమర్శలు చేస్తున్నారు.

కానీ పవన్ వాటికి సోషల్ మీడియా ద్వారా కౌంటర్లు ఇస్తున్నారు. అంటే తనని మరీ రెచ్చగొడితేనే పవన్..విరుచుకుపడతారని అర్ధమవుతుంది. ఇక సినిమా షూటింగ్‌లు అయిపోయాక..పవన్ బస్సు యాత్ర ద్వారా జనంలోకి రానున్నారు. మరీ అప్పుడు వైసీపీ టార్గెట్ గా విరుచుకుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news