జనసేనాని పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ ఘన విజయం సాధించగా, ఆయన అశేష అభిమానులు సంబురపడిపోయారు. పవన్ నటించే నెక్స్ట్ ఫిల్మ్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ అండ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ కోసం కసరత్తు చేస్తున్నాడు. కాగా, తాజాగా పవన్ కల్యాణ్ ను ‘భవదీయుడు భగత్ సింగ్’ మేకర్స్ కలిశారు. డైరెక్టర్ హరీశ్, ప్రొడ్యూసర్స్ పవన్ ను కలిసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
‘గబ్బర్ సింగ్ ’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ మరో పిక్చర్ చేస్తున్నారు. అదే ‘భవదీయుడు భగత్ సింగ్’ .. ‘దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్ టైన్మెంట్’ అనేది ట్యాగ్ లైన్. కాగా, ఈ సినిమాపై పవన్ కల్యాణ్ అశేష అభిమానులు బోలెడంత ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన నేపథ్యంలో ఈ చిత్రం డెఫినెట్ గా బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తుందని అంటున్నారు.‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ త్వరలో చెప్తామని ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ తెలిపారు. పవన్ ను కలిసిన సందర్భంగా హరీ శ్ శంకర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేశారు.
ప్రతీ సారి సమావేశం.. ప్రతీ సంభాషణ అడ్రినల్ రష్ ఇస్తుందని, అంతా సిద్ధంగా ఉందని, టేకాఫ్ కోసం వేచి ఉండలేకపోతున్నామని పేర్కొన్నారు. ఈ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని – వై.రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో పవన్ కు జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేగా నటించనుంది. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్.