క్రిష్ కి రివర్స్ ఛాలెంజ్ ఇచ్చిన పవన్ ఫ్యాన్స్!

-

లాక్ డౌన్ సమయంలో థియేటర్లు లేవు… కొత్త సినిమాలు చూసే అవకాశం లేదు! అయినా కూడా అంతటి సంబరాన్ని సోషల్ మీడియా ద్వారా అందించే ప్రయత్నం చేస్తూ.. అభిమానులకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటూనే ఉన్నారు సినీ జనాలు! ఈ క్రమంలో వీరిని మరింత యాక్టివ్ చేసింది… “బీ ద రియల్ మ్యాన్” అనే ఛాలెంజ్! ఇంటిలోని మహిళలకు రెస్ట్ ఇచ్చి వారు చేసే పనులను మగవారు చేయడమే ఈ ఛాలెంజ్ కి మీనింగ్! ఇందులో భాగంగా ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగా ఓ ఛాలెంజ్‌ను దర్శకధీరుడు రాజమౌళికి విసరడం.. అనంతరం అది టాప్ దర్శకులను, స్టార్ హీరోలను దాటి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని చేరడం తెలిసిందే!

అలా దర్శకుడు క్రిష్ ఈ ఛాలెంజ్‌ లోకి సెలబ్రిటీలను కాకుండా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ని నామినేట్ చేయడంతో… పవన్ ఫ్యాన్స్ ఇంటి పనులు తెగ చేసేస్తూ… ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు… అవి కాస్త వైరల్ అవుతున్నాయి. అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్… తిరిగి దర్శకుడు క్రిష్ కే రివర్స్ లో మరో ఛాలెంజ్ విసరడం హైలెట్ అని చెప్పాలి. ఇంతకూ క్రిష్ కి పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఛాలెంజ్ ఏమిటంటే… పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి, పెద్ద హిట్ కొట్టి తీరాలని!

ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో కాస్త వెనకబడిన సంగతి తెలిసిందే! జనసేన పార్టీ స్థాపన, అనంతరం పార్టీ కార్యక్రమాలు, తర్వాత ఎన్నికలు.. అనంతరం ఫలితాలు… కాస్త గ్యాప్ ఇచ్చే లోపు కరోనా… ఇలా ఎన్నో ఒడిదుడుకుల అనంతరం అన్నీ అనుకూలంగా జరిగితే 2021లో మళ్లీ థియేటర్లలో సినిమాలు విడుదల అయితే… అప్పుడు దర్శకుడు క్రిష్ – పవన్ తో ఒక సినిమా తీసి, దాన్ని సూపర్ హిట్ చేస్తే… ఈ ఛాలెంజ్ లో క్రిష్ గెలిచినట్లేనన్నమాట!

Read more RELATED
Recommended to you

Latest news