కర్ర సామును ఇరగదీస్తున్న అకీరానందన్…

-

పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ కొడుకు, బ్యూటీ రేణు దేశాయ్​ ల సంతానం అకీరానందన్ ( Akira Nandan )​ గురించి తెలుగు వాళ్లందరికీ తెలుసు. అంతలా ఈ వారసుడు స్టార్​ డమ్​ సంపాదించుకున్నాడు. పవన్​ కల్యాణ్​ తో విడిపోయి రేణు దేశాయ్​ విడిగా ఉంటున్నా కూడా తాను ఎప్పుడూ అభిమానులతో టచ్​ లో ఉంటుంది. అందుకోసమే పవర్​ స్టార్​ పిల్లల అప్డేట్లన్నీ తెలుగు ప్రేక్షకులకు ఇట్టే తెలసిపోతుంటాయి.

తాజాగా రేణు దేశాయ్​ సోషల్​ మీడియా వేదిక ఇన్​ స్టాగ్రామ్​ లో ఓ వీడియోను పంచుకుంది. పవర్​ స్టార్​ కుమారుడు అకీరానందన్​ కర్ర సాము చేస్తున్న వీడియో అది. చాలా పెరిగిపోయిన అకీరా కర్ర సాముని ఇరగదీస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను రేణు అభిమానులతో పంచుకోవడం విశేషం.

అకీరానందన్ | Akira Nandan
అకీరానందన్ | Akira Nandan

ప్రస్తుతం రేణు దేశాయ్​ అప్లోడ్​ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన పవర్​ స్టార్​ అభిమానులు ఫుల్​ ఖుషీగా ఫీలవుతున్నారు. త్వరలోనే అకీరానందన్​ హీరోగా దర్శనం ఇస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా పవన్​ కల్యాణ్​ , రేణు దేశాయ్​ లకు అకీరానందన్​ కాకుండా మరో సంతానం కూడా ఉంది.

ప్రస్తుతం రేణు దేశాయ్​ పవన్​ కల్యాణ్​ తో వేరుగా ఉంటుంది. పవన్​ కల్యాణ్​ ప్రస్తుతం మూడో పెళ్లి చేసుకున్నాడు. కాగా… రేణు దేశాయ్​ అభిమానులతో ఎప్పుడూ టచ్​ లో ఉండడమే కాకుండా కరోనా లాక్​ డౌన్​ సమయంలో అనేక మందికి సాయం చేసింది. తాను దేశంలో జరుగుతున్న సమస్యలపై కూడా తన దైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news