ఈ శుక్ర‌వారం : మ‌హేశ్ సినిమాకు ప‌వ‌న్ స‌పోర్ట్ !

కొట్టుకున్నంత ద్వేషం లేదు ఆ ఇద్ద‌రికీ.. ఒక‌రిపై ఒక‌రు ద్వేషాన్ని ఏనాడూ చూప‌లేదు ఇక‌పై చూపరు కూడా ! ప‌వ‌న్ అంటే మ‌హేశంకు ఇష్టం. గౌర‌వం కూడా ! ఆయ‌న సినిమా హిట్ అయితే ప‌వ‌న్ ఆనందిస్తారు.ఇంకేం ఇద్ద‌రినీ క‌లిపిన‌ సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి.

నిన్న‌టి వేళ విడుద‌ల‌యిన స‌ర్కారు వారి పాట సినిమాలో భీమ్లా నాయ‌క్ పాట వ‌స్తుంటే మ‌హేశ్ అభిమానులు కూడా తెగ ఎంజాయ్ చేస్తూ విజిల్స్ వేశారు. అంతేకాదు ఓ డైలాగ్ పూర్తిగా ప‌వ‌న్ ను ఉద్దేశించే చెప్పారా అన్న విధంగా ఉంది..ఎక్క‌డ‌యినా ఫ్యాన్స్ ఉంటారు.. మంచి చేస్తే ఫ్యాన్స్ వాళ్లంత‌ట వాళ్లే వ‌స్తారు.. అన్న అర్థం వ‌చ్చే విధంగా మ‌హేశ్ చెప్పిన డైలాగ్..కూడా చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా సినిమా ఎలా ఉన్నా చిన్నారుల‌కు ఆయ‌న చేస్తున్న సాయం మాత్రం పవ‌న్ అభిమానులను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. అదే ఇప్పుడు వైర‌ల్ అవుతోంది కూడా ! మహేశ్ స‌ర్ ! మీ సినిమా బాగుంటే మ‌రో న‌లుగురు చిన్నారుల‌కు ప్రాణం నిల‌బ‌డ‌తుంది అని కూడా రాశారు కొంద‌రు. ఇంకేం చాలా రోజుల‌కు ఓ మంచి వార్త ఒక‌టి..అటు ప‌వ‌న్ కు ఇటు మ‌హేశ్ కు..ఇలానే ఉండాలి అభిమానులు అంటే.. ఉంటారు కూడా !

అంటే ఈ స‌మాజానికి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల‌కూ ప‌వ‌న్ చేసిన సాయం, మ‌హేశ్ చేసిన సాయం ఇవ‌న్నీ ఇప్పుడు అంద‌రినీ భ‌లే ఆలోచింపజేస్తున్నాయి.. అందుకే ఇక‌పై ఫ్యాన్ వార్ ఉండ‌దు అనే కోరుకోవాలి మ‌నం.

సినిమాల‌ప‌రంగా ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డ‌డం త‌ప్ప‌దు. కానీ ఏ మాట‌కు ఆ మాట సినిమాల కార‌ణంగానే ఒక‌రిని ఒక‌రి నొప్పించుకున్న దాఖ‌లాలు కూడా లేవు. అయినా కూడా ఫ్యాన్స్ మాత్రం తెల్లారితే చాలు మావోడు గ్రేట్ అంటే మావోడే గ్రేట్ అంటారు. బాబుల‌కే బాబు మ‌హేశ్ బాబు ఒక‌రు.. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈజ్ ఎ ప‌వ‌ర్ స్టార్ అంటూ ..అరుస్తుంటారు.

నిన్న‌టి వేళ థియేట‌ర్ల‌లో ప‌వ‌న్ అభిమానులు మ‌హేశ్ అభిమానులు కొన్ని అరుపులు అరిచారు. కొన్నిచోట్ల అయితే ప‌వ‌న్ అభిమానులు కొంత సంయ‌మ‌నం పాటించారు. మ‌హేశ్ తోపు ద‌మ్ముంటే ఆపు లాంటి డైలాగులు విన్నా కూడా ప‌వ‌న్ అభిమాన వ‌ర్గానికి చెందిన ఎవ్వ‌రూ అంత‌గా రియాక్ట్ కాలేదు. ఈ విష‌య‌మై ప‌వ‌న్ కూడా మెచ్చుకోవాలి అని అంటున్నారు సినీ విశ్లేష‌కులు. ఎందుకంటే నేనేమ‌యినా నాపేరిట మిమ్మ‌ల్ని త‌న్నుకు చావ‌మ‌ని చెప్పానా అని ప‌దే ప‌దే అంటుంటారు ఆయ‌న.

అదే మాట విని నిన్నటి వేళ సోష‌ల్ మీడియాలో కొద్ది సేపు ఫ్యాన్ వార్ న‌డిచినా త‌రువాత చాలామంది ప‌వ‌న్ అభిమానులు మ‌హేశ్ సినిమాకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మ‌హేశ్ బాబు చిన్నారుల‌కు అందిస్తున్న సాయం, వారికి తిరిగి ప్రాణం పోసే విధంగా చేయిస్తున్న గుండె సంబంధ ఆప‌రేష‌న్లు ఇవ‌న్నీ కూడా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. మ‌హేశ్ కు ప‌వ‌న్ అభిమానుల నుంచే అభినంద‌న‌లు ద‌క్కాయి. ఇది క‌దా కావాలి..వెల్డ‌న్ మ‌హేశ్..వెల్డ‌న్ ప‌వ‌న్.. మీరు సాయం చేస్తే దేవుళ్లు అవుతారో లేదో కానీ ఉన్నత వ్య‌క్తిత్వం ఉన్న మ‌నుషులుగా మాత్రం ఈ చ‌రిత్ర‌లో త‌ప్ప‌క నిలిచిపోతారు.స‌హృద‌య రీతికి సంకేతం అంటే ఇదే ! ఈ శుక్ర‌వారం నేర్పిందిదే !