Bheemla Nayak: లాలా.. భీమ్లా.. రిలీజ్ డైలామాలా.. భీమ్లా..!

-

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధానపాత్రల్లో నటించిన ‘భీమ్లా నాయక్. మలయాళంలో సూప‌ర్ హిట్ అయిన‌ ‘అయ్యప్పనుమ్ కోశియమ్స‌కు ఈ చిత్రం రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారిగా నటిస్తోండ‌గా.. నెగిటివ్ క్యారెక్ట‌ర్లో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో నిత్యామేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లు న‌టించ‌నున్నారు.
ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండ‌గా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా… పోస్టర్స్ , టైటిల్ సాంగ్ కు మంచి వ్యూస్ వ‌చ్చాయి. రికార్డ్ వ్యూస్ తో దూసుకెతున్నాయి. దీంతో సినిమాపై హైప్ తీసుకు రావడంతో సినిమాపై హీట్ పెరుగుతూ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే.. సినిమాను సాధ్య‌మ‌నంత త్వ‌ర‌గా.. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్ర‌య‌త్నాలు చేస్తు్న్నారు. ఈ క్ర‌మంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ప్ర‌చారం చేసే మూవీ మేక‌ర్స్ వెన‌క్కి త‌గ్గిన‌ట్టు స‌మాచారం.

ఈ స‌మాచారం మేర‌కు ఈ సినిమా సంక్రాంతి బరినుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. దానికి ప్ర‌ధాన కారణం ఇప్ప‌టికే సంక్రాంతి బ‌రిలో ఆర్ఆర్ఆర్.. రాధేశ్యామ్ ఉన్నాయి. ద‌ర్శ‌క దిగ్గ‌జం నిర్మిస్తున్నా ఆర్ఆర్ఆర్ మూవీ మీద ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే భారీ ఎత్తున్న స్పంద‌న వ‌స్తుంది. అలాగే.. రాధేశ్యామ్ కూడా సంక్రాంతి బ‌రిలో ఉండ‌టంతో మిగతా సినిమాలన్నీ ఈ సంక్రాంతికి వెనక్కి తగ్గడమే బెటర్ గా ఫీలవుతున్నాయి.

మొన్నటి వరకు ధీమాగా ఉన్న భీమ్లా మేకర్స్ ఇప్పుడు డైలమాలో పడ్డట్లుగా ప్రచారం జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24, లేదా 25న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version