ఎన్టీఆర్ కి పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్..!

-

అభిమానులు అందరూ ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది హీరోలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ, సహా చాలా మంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా ఆయనకు పవర్ స్టార్ జనసేన ని పవన్ కళ్యాణ్ జనసేన లెటర్ హెడ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆస్కార్ పురస్కారాలు అందుకున్న ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీప్రియుల మెప్పు పొందారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణమైన సంతోషాన్ని పొందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.” అని అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుంచి నిన్ననే ఒక పాట రిలీజ్ చేశారు. ఆ పాటకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది ఇక మరొక ప్రశాంత్ నీల్ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది అంటూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news