విజయ్ దేవరకొండ, సమంత మూవీ ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్

-

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కు ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. దీంతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత కాంబో లో VD11 పేరుతో ఒక మూవీ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ గత నెలలో ప్రారంభమైంది. ఈ సినిమాకి దర్శకత్వం శివ నిర్వాణ వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

VD11 మూవీకి ప్రఖ్యాత యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆన్-బోర్డ్‌లో ఉన్నారు. పీటర్ హెయిన్ మరియు దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రంలో విజయ్ నటించిన యాక్షన్ ఓరియెంటెడ్ విచిత్రమైన ఇంట్రడక్షన్ సీక్వెన్స్‌ను రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. VD11 ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు ఉదయం 9:30 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు అప్డేట్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news