BREAKING : యూట్యూబ్‌ స్టార్‌ సరయుపై సిరిసిల్లాలో పోలీస్‌ కేసు

-

యూట్యూబ్ నటి, బిగ్‌ బాస్‌ ఫేం సరయు కు ఊహించని షాక్‌ తగిలింది. బిగ్‌ బాస్‌ ఫేం సరయుపై తాజాగా సిరిసిల్ల పిఎస్ లో కేసు నమోదు అయింది. నటి సరయు పై ఫిర్యాదు చేశారు విహెచ్పి రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు చేపూరి అశోక్. ఆయన కేసు నమోదు చేయడంతో… ఆ కేసును బంజారాహిల్స్ పిఎస్ కు బదిలీ చేశారు సిరిసిల్లా జిల్లా పోలీసులు.

తన హోటల్ ప్రమోషన్ లో హిందువులను కించపరిచారని ఆమె ఫిర్యాదు చేశాడు విహెచ్పి రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు చేపూరి అశోక్. హోటల్ ప్రచార సాంగ్ లో గణపతి బప్పా మోరియా బ్యాండ్ ను తలకు సరయు, ఆమె మిత్రులు ధరించారు.

దేవుడి బొమ్మలు దరించి మద్యం సేవించి హోటల్స్ దర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశానని.. రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వ హిందు పరిషత్ అధ్యక్షుడు చేపూరి ఆశోక్ వెల్లడించారు. ఇలాంటి వారిపై తప్పకుండా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news