బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల ప్రవర్తనా నియామావళికి సంబంధించి.. పంజాబ్ లోని మోగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉత్వర్వులను ఉల్లంఘించినందుకు సినీ నటుడు సోనూ సూద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఆదివారం నాడు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.
కాగా.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగానే మోగా నియోజక వర్గం నుంచి నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ట్ పై పోటీ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రాలను సందర్శించకుండా అధికారులు ఆదివారం సోనూసూద్ ను అడ్డుకున్నారు. అంతేకాదు.. సోనూసూద్ కు చెందిన కార్లు, కూడా సీజ్ చేశారు.
కాగా..కరోనా నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సోనూసోద్ ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి చేయూతను అందించాడు. ఇతర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయే వలసకూలీలను తన ఖర్చులతో వారి స్వగ్రామాలకు పంపించాడు.