” పొన్నియన్ సెల్వన్” 1 ట్రైలర్ రిలీజ్

-

ఫేమస్ రైటర్ కల్కి కృష్ణమూర్తి రాసిన చారిత్రాత్మక నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఇండియన్ జీనియస్ డైరెక్టర్ మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ అనే చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30న ఫస్ట్ పార్ట్ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ ఫిల్మ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడంపైన ఫోకస్ పెట్టారు.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం కోసం సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇందులో భారీ తారాగణమే ఉంది. ఐశ్వర్య రాయ్, త్రిష, చియాన్ విక్రమ్ , జయం రవి , కార్తి , జయరాం , ప్రకాష్ రాజ్ , ప్రభు, శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా ‘పొన్నియన్ సెల్వన్ -1 ’ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో చియాన్ విక్రమ్ యాక్టింగ్ ఇరగదీశాడు.

Read more RELATED
Recommended to you

Latest news