ప‌వ‌న్ ఫ్యాన్స్ భ‌య‌ప‌డుతున్నారా?

క‌రోనా ఎవ‌రు అజాగ్ర‌త్త‌గా వుంటే వారికి చుక్క‌లు చూపిస్తోంది. కొంత మంది ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా చిన్న ఏమ‌ర పాటుగా వుంటే క‌రోనా ఎటాక్ అవుతోంది. దీంతో సెల‌బ్రిటీలు సైతం ట్రీట్‌మెంట్ చేయించుకోగ‌ల స్టోమ‌త వున్నా ప‌రిస్థితి చేయిదాటిపోతే ఏంటీ అని భ‌య‌ప‌డుతున్నారు. తాజాగా కొంత మంది సినీ సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డి మృత్యు ఒడిలోకి వెళ్లిపోయారు.

కొంత మంది చావు దాకా వెళ్లి తిరిగి వ‌స్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా క‌రోనా బారిన ప‌డ‌టంతో ప‌వ‌న్‌క‌ల్యాన్ ఫ్యాన్స్ భ‌య‌ప‌డుతున్నార‌ట‌. `ఆచార్య` షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసిన వారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను` అని మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌కు క‌రోనా సోకింద‌ని స్ప‌ష్టం చేయ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నార‌ని తెలిసింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌త కొన్ని నెల‌లుగా చ‌తుర్మాస దీక్ష కార‌ణంగా ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మయ్యారు. తాజాగా మూవీ షూటింగ్స్ తిరిగి ప్రారంభం కావ‌డంతో `వ‌కీల్‌సాబ్‌` చిత్రీక‌ర‌ణ కూడా మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ కూడా సెట్ లోకి ఎంట‌ర‌య్యారు. మెట్రో ఎక్క హ‌ల్‌చ‌ల్ చేశారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌కి కూడా క‌రోనా సోకే ప్ర‌మాదం వేంద‌ని, త‌గు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, బ‌య‌టికి రావొద్ద‌ని ప‌లువురు ప్ర‌ముఖులు, అభిమానులు ప‌వ‌న్‌కు సూచిస్తున్నారు. అభిమానులు మాత్రం ప‌వ‌న్‌ని వేడుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ టాపిక్ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.