Prabash: హీరో కాకపోతే ఏమయ్యేవారో తెలుసా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించడమే కాకుండా అన్ని భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. అయితే ఇంతటి స్టార్డమ్ సంపాదించిన ప్రభాస్ కెరియర్ మొదట్లో హీరోగా సక్సెస్ కావడం కోసం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. అయితే ప్రభాస్ హీరోగా కాకపోతే ఏమయ్యేవారు అనే విషయం ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు. ప్రభాస్ అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. అయితే నటనకు ముందే హైదరాబాదులో శ్రీ చైతన్య కళాశాలలో బీటెక్ని పూర్తి చేశారు ప్రభాస్. ప్రభాస్ సొంత ఊరు మొగల్తూరు. ప్రభాస్ ముందుగా సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకోలేదట . ఏదైనా హోటల్ పెట్టి..హోటల్ వ్యాపారం చేయాలనుకున్నారట. అయితే కొన్ని కారణాల చేత సిని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరో అయ్యాడు. ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం ప్రభాస్ కెరియర్ లోనే అత్యున్నత స్థానానికి తీసుకువెళ్ళింది అని చెప్పవచ్చు.

బాహుబలి సినిమా చేస్తున్న సమయంలో తన వద్దకు వచ్చిన ప్రతి ప్రాజెక్టును కూడా రిజెక్ట్ చేశారు. ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం రాయల్ ఆల్బర్ట్ హల్ లో విడుదలైన ఏకైక ఆంగ్లేతర చిత్రమట. ఈ ఘనత కేవలం ప్రభాస్ మాత్రమే సాధించారు.దాంతో దాదాపుగా కొన్ని ప్రకటనల ద్వారా రూ. 15 కోట్ల ఆఫర్లను కూడా వదులుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కి ఇష్టమైన సినిమాలు రాజ్ కుమార్ ఇరానీ చిత్రాలు తన ఫేవరెట్ అని పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. ప్రభాస్ హీరోగా కాకుంటే వ్యాపార రంగం వైపు అడుగుపెట్టి అందులో సక్సెస్ కావాలనుకున్నారట. అయితే ఇప్పుడు ఎన్నో వ్యాపారాలను మెయింటైన్ చేస్తూ ఉన్నారు ప్రభాస్.

Read more RELATED
Recommended to you

Latest news