ప్రభాస్ అనుష్క ఇప్పుడు కన్ఫాం చేయొచ్చు..!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, క్రేజీ బ్యూటీ అనుష్కల జోడీ ఎంత పెద్ద సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. బిలా నుండి బాహుబలి వరకు ప్రభాస్, అనుష్క పెయిర్ అంటే ఫ్యాన్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఇద్దరు ఆన్ స్క్రీన్ రొమాన్స్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ రిలేషన్ లో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. కొన్ని మీడియా ఛానెల్స్ అయితే ప్రభాస్ పెళ్లి చేసుకునేది అనుష్కనే అంటూ వార్తలు రాశారు.

ఈ వార్తలను ఖండిస్తూ ఎప్పటికప్పుడు వారు క్లారిటీ ఇస్తున్నా మళ్లీ పుట్టిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ప్రభాస్ జోడీగా అనుష్క కన్ఫాం అంటున్నారు. అయితే అది రియల్ లైఫ్ లో కాదు.. సాహో తర్వాత ప్రభాస్ చేయబోయే రాధాకృష్ణ సినిమాలో అనుష్క నటిస్తుందట. ఈ సినిమాలో పూజా హెగ్దె ఒక హీరోయిన్ గా నటిస్తుండగా అనుష్క కూడా స్పెషల్ రోల్ చేస్తుందట.

యువ్ క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీగా వస్తుందని తెలుస్తుంది. సినిమా మొత్తం ఫారిన్ లోనే ఉంటుందట. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సాహో సినిమా 2019 జూలై, ఆగష్టులలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాతే రాధాకృష్ణ సినిమా అప్డేట్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news