సమంత ‘ఓ బేబి ఎంత సక్కగున్నావే’

-

ఆఫ్టర్ మ్యారేజ్ ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తున్న అక్కినేని కోడలు సమంత యూటర్న్ తో మొదటి ప్రయత్నం పర్వాలేదు అనిపించుకుంది. ఇక ప్రస్తుతం నాగ చైతన్యతో మజిలి సినిమాలో నటిస్తున్న సామ్ కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ మూవీ నిర్మించబడుతుంది.

ఇక ఈ సినిమాకు టైటిల్ గా ఓ బేబి ఎంత సక్కగున్నావే అని ఫిక్స్ చేశారట. సినిమాలో సమంత 70 ఏళ్ల బామ్మగా కనిపించనుంది. గ్రానీ కాస్త పడుచుపిల్లగా మారి ఆమె చేసే హంగామా ఎలా ఉంటుందో ఓ బేబి ఎంత సక్కగున్నావే సినిమాలో చూడాలి. సైలెంట్ గా సినిమా షూటింగ్ జరుగుతుందట. 2019 ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

సమంత కెరియర్ లో మొట్టమొదటి సారిగా ఈ రేంజ్ ప్రయోగం చేస్తుంది. మరి 70 ఏళ్ల బామ్మగా సమంత నటన ఎలా ఉంటుంది.. ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news