ప్రభాస్ మారుతి వైపు ఉంటాడా లేక అశ్వని దత్ పక్కనా.!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన లైనప్ చూసి బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా కుళ్ళు కుంటున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రోజెక్ట్ కె, స్పిరిట్ ఇలా ఉంది మనోడి సినిమాల జాబితా ఇవన్ని 2000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలు ఉన్నాయంటే ప్రభాస్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇది ఇప్పటి వరకూ ఇండియాలో ఎవరికి సాధ్యం కాని రికార్డ్ అందుకే సూపర్ స్టార్ గా ఉన్నాడు. వీటి అన్నింటి మధ్యలో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.హారర్ కామెడీ నేపథ్యంతో సాగే స్టోరీ ఇది. ఒక థియేటర్ చూట్టూ తిరిగే కథ. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు.ఇక అచ్చమైన తెలుగు సినిమా డైరెక్టర్ ఈ సినిమా తీస్తుండడం తో ఇందులో తెలుగు ప్రేక్షకులు కోరుకునే కామిడీ, రొమాన్స్ అంశాలు ఉంటాయని అంటున్నారు

ఇక ఈ సినిమా ను మారుతి జెట్ స్పీడ్ లో షూటింగ్ జరిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా ను ఈ ఏడాది లోనే కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు అతనికి అశ్వనీ దత్ రూపంలో అడ్డంకి ఎదురు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అశ్వని దత్ కూడా ప్రభాస్ తో 500 కోట్ల తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మారుతి సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా రిసుల్ట్ తన సినిమా పై పడుతుందని కంగారు పడుతున్నారని, అందుకే మారుతి సినిమా ను ప్రోజెక్ట్ కె తర్వాత రిలీజ్ చేయాలని కండిషన్ పెడుతున్నారట.ఇందు కోసం మారుతి ప్రభాస్ ను సాయం చేయాలని కోరడంతో దత్ తో మాట్లాడుతా అని అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news