ప్రభాస్ ‘జాన్’ సినిమా కొత్త అప్డేట్ వింటే ప్రభాస్ ఫాన్స్ డల్ అయిపోవడం గ్యారెంటీ ?

‘బాహుబలి’ సినిమా తో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ అదిరిపోయే మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు ప్రభాస్. దీంతో ‘బాహుబలితో’ దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు రావడంతో నెక్స్ట్ సినిమా అదే స్థాయిలో విజయం సాధించాలని ‘సాహో’ చేశాడు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాదాపు రెండు సంవత్సరాలపాటు ప్రభాస్ ‘సాహో’ సినిమా కోసం షూటింగ్ చేశాడు. సినిమా రిజల్ట్ కి ప్రభాస్ అభిమానులతో పాటు ప్రభాస్ కూడా తీవ్ర నిరుత్సాహం చెందారు. Image result for prabhas latest update

అయితే ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న జాన్… సాహో సినిమా షూటింగ్ సమయంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో ఆ సందర్భంలో సినిమా 2020 స్టార్టింగ్ లో విడుదల అవుతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ ఏడాది వచ్చి ఒకటిన్నర నెలలు అయిపోయినా కానీ రిలీజ్ సంగతి దేవుడెరుగు ఇంతవరకు సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ కూడా బయటికి రాలేదు.

 

దీంతో సమ్మర్ కి రిలీజ్ అవుతుందని ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటూ ఎదురుచూస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ సినిమాకి సంబంధించి సగం షూటింగ్ కూడా ఇప్పటి వరకూ పూర్తిగా లేనట్లు ఫిలింనగర్లో తాజాగా ఒక వార్త బయటపడింది. మేటర్ లోకి వెళ్తే సినిమాలో మెయిన్ విలన్ రోల్ కోసం జగపతిబాబును ఇటీవల సెలక్ట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సినిమాకి సంబంధించిన సగం షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదని ఫిలిం నగర్ టాక్. దీంతో ఈ వార్త తీర్చుకుంటే నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ డల్ అయిపోవడం గ్యారెంటీ.