ప్రభాస్‌కు రాముడంటే భయమా ?

-

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలిస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచురల్‌ ప్రభాస్‌ ఓ ఇంటివాడు అవుతున్నాడని ఊహించుకోవద్దు. పెళ్లి గురించి ఈ బ్రహ్మచారే మర్చిపోయాడు. మరి ప్రభాస్‌లో వచ్చిన మార్పేమిటి ఫ్యాన్స్‌కు ఎందకంత ఆనందం అంటే…

బాహుబలి రిలీజ్‌ తర్వాత ప్రభాస్‌ వెయిట్‌ పెరిగాడు. సాహోలో అక్కడక్కడా స్లిమ్‌గా కనిపించినా.. చాలాచోట్లు.. ఫేస్‌లో తేడా కొట్టింది. యంగ్‌ లుక్‌ పోయి మిడిల్‌ ఏజ్‌ లుక్‌ వచ్చేసింది. ఈమధ్యకాలంలో ప్రభాస్‌ ఎక్కడ కనిపించినా.. ఫేస్‌లో మార్పు కనిపించలేదు. దీంతో ఎలా వుండే హీరో.. ఎలా అయిపోయాడంటూ.. ఫ్యాన్స్‌ బాధపడ్డారు. మొత్తానికి ప్రభాస్ బద్దకాన్ని రాముడు పోగొట్టాడు.

ప్రభాస్‌ రెండేళ్లుగా నటిస్తున్న ‘రాధే శ్యామ్‌’ షూటింగ్ డిసెంబర్‌నాటికి పూర్తవుతుందట. జనవరి నుంచి ఆదిపురుష్‌లో జాయిన్‌ అవుతాడు. ఇంతకాలం వెయిట్‌పై ఇంట్రెస్ట్‌ పెట్టని ప్రభాస్‌ రాముడి గెటప్‌ అనేసరికి రూల్స్‌ ఫాలో అవుతున్నాడు. దర్శకుడు ఓం రౌత్‌ వెయిట్‌ తగ్గాలని చెప్పడంతో… తూచ తప్పకుండా పాటిస్తూ… సన్నగా మేకోవర్‌ అయ్యాడు. దేవుడి మీద భక్తో.. క్యారెక్టర్‌ మీద నమ్మకమోగానీ.. వర్కవుట్స్‌ చేసి వెయిట్‌ తగ్గాడు. ప్రస్తుతం ఈ కొత్త లుక్‌ నెట్‌లో వైరల్‌ అవుతోంది.

ఆదిపురుష్‌ కంటే ముందే నాగ అశ్విన్‌ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా.. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తికాకపోవడంతో… మైథలాజికల్‌ మూవీ చేసేస్తున్నాడు. రాధే శ్యామ్‌ ఇటలీ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని రావడం ఆలస్యం.. ముంబయి వెళ్లిపోయి అక్కడే మకాం వేసేశాడు. స్క్రిప్ట్‌ విన్నాడు. అలాగే.. రాముడి గెటప్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నాడట. మరోవైపు సన్నబడ్డాడు. మొత్తానికి ఆదిపురుష్‌ పుణ్యమా అని ముదురు లుక్‌ నుంచి బైటపడ్డాడు ప్రభాస్‌.

Read more RELATED
Recommended to you

Latest news