రెండు కళ్లు, రెండు కొమ్ములు ఉన్న ఎద్దులను చూడటం సహజం. ఎందుకంటే.. దాదాపుగా అన్ని ఎద్దులకు రెండు కళ్లు, రెండు కొమ్ములే ఉంటాయి. కానీ.. ఈ ఎద్దును చూడండి. దానికి మూడు కొమ్ములు, మూడు కళ్లు ఉన్నాయి. మూడు కళ్లు ఒక్క శివుడికే ఉంటాయి. అందుకే శివుడిని త్రినేత్రులు అని పిలుస్తారు. కానీ.. ఈ ఎద్దుకు కూడా మూడు కళ్లు ఉన్నాయి. అందుకే దీన్ని ఈశ్వరుడి ఎద్దు అని పిలుస్తారట. అయితే.. ఈ ఎద్దు ఎక్కడ ఉందో తెలియనప్పటికీ… అది ఓ గుడి వద్ద ఉండగా.. భక్తులు దాన్ని మొక్కుతూ.. ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
(Video Courtesy: Sarkari Naukri Exams)