ప్ర‌భాస్ బుధ‌వారం డిసైడ్ చేసేస్తాడా?

-

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అమెరికా నుంచి హైద‌రాబాద్ కు ఇటీవ‌లే తిరిగొచ్చాడు. సాహోలో కీల‌క‌మైన సాంగ్ షూట్ పూర్తిచేకుని అడుగు పెట్టాడు. ఇప్ప‌టికే టాకీ పూర్త‌యింది. సాంగ్స్ మాత్రం బ్యాలెన్స్ ఉండ‌టంతో టీమ్ ఆ ప‌నిలోనే బిజీగా ఉంది. అటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆగ‌స్టు 15న రిలీజ్ చేయ‌డ‌మే టార్గెట్ గా పెట్టుకుని టీమ్ అహ‌ర్నిష‌లు శ్ర‌మిస్తోంది.అటు డార్లింగ్ జాన్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సాహో రిలీజ్ అనంత‌రం పూర్తిగా ఆ సినిమాపైనే కాన్సంట్రేట్ చేయ‌నున్నాడు. అది ప్ర‌భాస్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోవ‌డం ఖాయ‌మ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే టైమ్ లో ప్ర‌భాస్ కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ వినిపించిన లైన్ కు క‌మిట్ అయ్యాడు.

Prabhas upcoming Movie Jaan Updates

ఇప్ప‌టికే స్టోరీని యూవి క్రియేష‌న్స్ లాక్ చేసింది. ఇదియూనివ‌ర్శిల్ అప్పీల్ ఉన్న క‌థ అని అంటున్నారు. సాహో త‌ర‌హాలో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మ‌ని వినిపిస్తోంది. అయితే ప్ర‌భాస్ కు బౌండెడ్ స్ర్కిప్ట్ వినిపించాయాల్సి ఉంది. తాజాగా బుధ‌వారం మ‌రోసారి ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ కు ఫుల్ నేరేషన్ చేయ‌నున్నాడుట‌. అనంత‌రం ప్ర‌భాస్ క‌థ‌ను విని ఫైనల్ చేయ‌నున్నాడ‌ని యూవీ క్రియేష‌న్స్ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. క‌థ‌లో మార్పులు, చేర్పులు ఉంటే సూచించ‌నున్నాడుట‌. అంతా ఒకే అయినా సినిమా సెట్స్ కు వెళ్ల‌డానికి మాత్రం స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ కేజీఎఫ్ చాప్ట‌ర్ -2ని తెర‌కెక్కిస్తున్నాడు. చాప్ట‌ర్ -1 త‌ర‌హాలోనే ప్ర‌తీ ప్రేమ్ ను ద‌ర్శ‌కుడు చెక్కుతున్నాడు.

వ‌చ్చే ఏడాది సినిమా రిలీజ్ కానుంది. అంటే అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌శాంత్ నీల్ ఆ సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉంటాడు. ఇటు ప్ర‌భాస్ జాన్ లో న‌టిస్తున్నాడు. ఇదీ భారీ స్పాన్ తోనే తెర‌కెక్కుతోంది. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసి రిలీజ్ చేయ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో కేజీఎఫ్-2, జాన్ చిత్రాలు దాదాపు ఒకేసారి రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. అనంత‌రం ప్ర‌భాస్, ప్రశాంత్ ఫ్రీ అవుతున్నారు. అటుపై ఎప్పుడు సెట్స్ కు వెళ్లేది డిసైడ్ అయ్యే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news