‘సీతారామం’ కోసం రంగంలోకి రెబల్ స్టార్ ప్రభాస్

-

వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘సీతా రామం’. ఇందులో హీరోగా మాలీవుడ్(మలయాళం)మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించారు. దుల్కర్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ నటించింది. టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ చాలా హృద్యంగా ఉంది.

లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ అదరగొట్టేశాడు. కశ్మీర్ కొండల్లో పహారీ కాస్తున్న ఒంటరి సైనికుడిగా అతడిని చూపించారు. ఇక ఇది ఇలా ఉండగా… ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ బుధవారం అంటే ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు జరగనుంది. ఇక ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు గెస్ట్‌ గా ప్రభాస్‌ వస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. వైజయంతి చిత్ర బృందం తో ప్రభాస్‌ కు మంచి సంబంధాలు ఉండటంతో.. ఈ సినిమాకు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు ప్రభాస్‌ వస్తున్నారట. కాగా.. ‘సీతా రామం’ సినిమా ఆగస్టు 5 వ తేదీన రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news