నందమూరి నటసింహం బాలయ్య ‘అఖండ’ ఫిల్మ్ తో సక్సెస్ అందుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈ సక్సెస్ తో ఈ భామకు చక్కటి అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ప్రజెంట్ ఈ భామ సోషల్ మీడియా క్వీన్ గా పేరు గాంచుతోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తూనే ఉంది.
తాజాగా ప్రగ్యా జైస్వాల్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా పెట్టిన పోస్టు ఒకటి ఆమెను ట్రోలింగ్ కు గురి చేస్తున్నది. నెటిజన్లు ఆమెను ఈ విషయమై విమర్శిస్తూనే ఉన్నారు. ఇంతకీ ఆమె ఏం ఫొటో పెట్టిందంటే.. బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో క్లీవేజ్ కనిపించేలా ఉండే డ్రస్ వేసుకుని ఓ ఫారిన్ బ్రాండ్ విస్కీ ప్రమోషన్ లో పాల్గొంది. దాంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావో? నీకు అయినా అర్థమవుతుందా అన్నంత రీతిలో ఆమెపైన విరుచుకుపడుతున్నారు.
సొసైటీకి రాంగ్ మెసేజ్ ఇచ్చినా పర్లేదా? కేవలం డబ్బుల కోసమే ఇటువంటి యాడ్స్ చేస్తారా? అని నెటిజన్లు ప్రగ్యా జైస్వాల్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రగ్యా జైస్వాల్ పైన మంచి అభిప్రాయం ఉండేదని, కానీ, ఈ యాడ్ ప్రమోషన్ వలన మొత్తం పోయిందని కొంరదు నెటిజన్లు అంటున్నారు. అన్ ఫాలో చేస్తామని హెచ్చరస్తున్నారు.
ఆల్కహాల్ హనికరం అన్న సంగతి తెలిసి కూడా ఇలా చేయడమేంటని అంటున్నారు. 25 ఇయర్స్ పైన వారికి వర్తిస్తుందనే పేర్కొంటున్నారు. కానీ, ఈ పోస్ట్ ను అంతకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్లు కూడా చూస్తారని నెటిజన్లు ప్రగ్యా జైస్వాల్ కు వివరిస్తున్నారు. చూడాలి మరి..ఈ విమర్శలపై బ్యూటిఫుల్ భామ ప్రగ్యా జైస్వాల్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో..
https://www.instagram.com/p/CcIZXcSMacV/