అలా చేస్తూ హీరోయిన్లకు చుక్కలు చూపిస్తున్న ప్రియా భవాని శంకర్..!

-

ప్రియా భవాని శంకర్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చి నటిగా అతి తక్కువ కాలంలోనే మంచి మంచి చిత్రాలలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఒకపక్క స్టార్ హీరోల చిత్రాలలో కనిపిస్తూనే మరోపక్క హీరోయిన్ గా చిత్రాలు చేస్తూ మరింత దూసుకుపోతోంది. ఇటీవల ధనుష్ నటించిన తిరు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె డబ్బు వస్తుందని నటించడానికి వచ్చాను అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.

తాజాగా తాను అలా అనలేదంటూ ప్లేట్ పిరాయించింది. ఇకపోతే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తక్కువ కాలంలోనే డబ్బు బాగానే కూడ పెట్టింది. ఇందుకు ఉదాహరణ గత డిసెంబర్ నెలలో చెన్నై సముద్రపు తీరంలో ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు తాను స్వయంగా వెల్లడించింది. ముఖ్యంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని పాలసీని ఈ అమ్ముడు బాగా అమలు చేస్తోందని సమాచారం. ఈ క్రమంలోని తాజాగా కొత్త బిజినెస్ ప్రారంభించిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఒక రెస్టారెంట్ కు ఓనర్ కాబోతుందట. ఇందుకు సంబంధించిన స్థలాన్ని కూడా కొనుగోలు చేసి అక్కడ రెస్టారెంట్ కట్టిస్తోందని సమాచారం. త్వరలో దీనిని ప్రారంభించనున్నట్లు నటి ప్రియా భవాని శంకర్ ఒక వీడియోని కూడా విడుదల చేసింది. తాజాగా ఒక వీడియోను ట్విట్టర్ వేదిక ద్వారా షేర్ చేసిన ఈమె అక్కడ ఒక రెస్టారెంట్లో వంట చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా కుకింగ్ డ్రెస్ ధరించి సర్వింగ్ సూన్ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. మొత్తానికైతే హీరోయిన్ గా అడుగులు వేసిన తొలి దశలోనే రెస్టారెంట్ అంటూ బిజినెస్ రంగంలోకి కూడా ఈ ముద్దుగుమ్మ అడుగు పెట్టడంతో ఈమె వేగం చూసి మిగతా హీరోయిన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news