‘లియో’ తెలుగు వెర్షన్ రిలీజ్ ఆలస్యం.. నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇదే

-

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 19న విడుదల కానుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్​గా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు విడుదలపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. టైటిల్‌ విషయంలో ఓ వ్యక్తి పిటిషన్‌ వేయగా వాదనల అనంతరం హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు విడుదలపై స్టే విధిస్తూ.. తెలుగులో ఈ సినిమాని అక్టోబరు 20 వరకు విడుదల చేయకూడదని ఆదేశించింది. దీంతో లియో తెలుగు వెర్షన్ రిలీజ్​పై సందిగ్ధత నెలకొంది. దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.

‘‘లియో’ సినిమా టైటిల్‌ విషయంలో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వచ్చిందని నాగవంశీ అన్నారు. అదే పేరుతో తెలుగులో వేరేవరో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారన్న విషయం తమకు తెలియదని.. వారు ముందుగా తమకు సమాచారం ఇవ్వకుండా నేరుగా కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ప్రస్తుతం లియో టీమ్ వారితో చర్చించి.. 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. విడుదల తేదీలో మార్పు ఉండదని.. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఆయనకు, తమకు నష్టం జరగకుండా చూసుకుంటామని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version